ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడం ... అందినకాడికి వెనుకేసుకోవడం. ఏమి చేయకపోయినా ఏదో చేస్తున్నామన్న భ్రమ కల్పించడం. ఇవే కదా ఏడాది ముందు వరకూ ఏపీ ప్రజలు చుసిన రాజకీయాలు. ఈ రాజకీయాలు ఇంతే ... గొప్పగా హామీలు ఇవ్వడం అధికారం దక్కిన తరువాత మర్చిపోవడం. పార్టీలు వేరు అయినా పాలకులంతా ఒక్కటే. ఇదే కదా ఏడాది కిందటి వరకు జనాలు చుసిన రాజకీయం. జనాలకు చిత్తశుద్దిగా పరిపాలన అందినచాలని చుసిన నాయకులు ఎవరూ ఇప్పటివరకు లేకపోవడం, దివంగత వైఎస్  రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే పేదలు, రైతుల పక్షపాతిగా పేరు తెచ్చుకున్నాడో అంత స్థాయిలో ఏడాది కిందటి వరకు ఎవరూ ప్రజల గురించి నిజాయితీగా ఆలోచించకపోవడం. ఇవేగా ఏడాది కిందట వరకు జనాలు చుసిన రాజకీయం. 

 

IHG

 

అందరిలో ఆషామాషీగా, జేబులు నిముకునే రాజకీయం చేస్తే నేను జగన్ ఎందుకు అవుతాను అని తనను తాను కొత్తగా నిరూపించుకుంటూ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటూ, ప్రతి క్షణం ప్రజాహితం అంటూ జగన్ పరిపాలన అందించడం మొదలు పెట్టి సరిగ్గా నేటికీ ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో జగన్ పాలన గురించి చెప్పుకోవాలంటే ... అది నిజంగా ఒక సరికొత్త రికార్డే అన్నట్టుగా ఉంది. ఏడాదిలో తాను ప్రకటించిన ఎన్నికల హామీలనే కాకుండా ప్రకటించని హామీలను కూడా అమలు చేసి చూపించాడు జగన్. నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపడమే పనిగా పెట్టుకుని మరీ ముందుకు వెళ్ళాడు... వెళ్తున్నాడు. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురయినా తట్టుకుంటూనే ఉన్నాడు. ప్రజాహితమే తన అభిమతంగా ముందుకు వెళ్తున్నాడు. 

 

IHG

జగన్ ఏడాది పాలనను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే మొత్తం పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపడమే పనిగా జగన్ ముందుకు వెళ్తున్నారు అనే విషయం అర్ధం అవుతుంది. వారి సంక్షేమం కోసం ఏం చేసేందుకైనా వెనకాడను అనే ధోరణిలో జగన్ ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఎన్నో ఆటుపోట్లు ఎదురయినా చిరునవ్వుతూ వాటికి అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాడు తప్ప ఎక్కడా వెనకడుగు వేసేందుకు ఇష్టపడడంలేదు. జగన్ మొండివాడు అనే పేరు ఎందుకు వచ్చిందో ఆయన పాలన చూస్తే అర్ధం అవుతుంది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం ప్రతి క్షణం ఆలోచన చేస్తూనే ముందుకు వెళ్తున్న తీరు నిజంగా అభినందనీయమే. 

 

IHG

 

తాను చేస్తున్న పాలన దేశంలో అందరికీ ఆదర్శంగా ఉండడమే కాకుండా అన్ని రాష్ట్రాలు జగన్ నిర్ణయాలు అమలు చేస్తూ ఏపీని రోల్ మోడల్ గా చూస్తున్నా... ఆ గొప్ప ఎక్కడా చెప్పుకోకుండా.. తాను కేవలం ఓట్లు వేసి నా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు మేలు చేయడం ఒక్కటే తప్ప మిగతా వేటినీ పట్టించుకోకుండా జగన్ ముందుకు వెళ్తున్న తీరు నిజంగా అందరికీ ఆదర్శనీయమే. జగన్ ఆలోచనలు ప్రతి క్షణం ప్రజాహితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: