జగన్ మూర్ఖుడు.. జగన్ అహంకారి.. జగన్ కోపిష్టి.. జగన్ ఎవరికీ లెక్క చేయడు.. జగన్ అవినీతి పరుడు.. జగన్ కు పాలన చేత కాదు.. తరచూ ఏబీఎన్ ఆర్కే తన కొత్త పలుకు శీర్షిక ద్వారా ప్రజలకు చెప్పేది ఇలాగే ఉంటుంది. కాస్త అంటూ ఇటూగా ఉన్నా సారాంశం ఇంతే. జగన్ పాలనను తూర్పారపట్టడమే తన విధి అన్నట్టుగా ఆ కాలమ్ ను నిర్వహిస్తారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.

 

 

అయితే అప్పుడప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ జగన్ ను కూడా పొగుడుతుంటారు. అయితే అది చాలా రేర్.. ఆ మధ్య కూడా ఓ వారం తన కొత్త పలుకులో జగన్ రాజనీది అదుర్స్ అంటూ చాలా కాలమ్స్ నింపేశాడు ఆర్కే.. ఈ రోజు ఆ స్థాయిలో కాకపోయినా కొన్ని విషయాల్లో జగన్ బెటర్ అంటూ ఆర్కే కామెంట్ చేశాడు. జగన్ తో పోలిస్తే చంద్రబాబుకు రాజకీయ వ్యూహాలు అంతగా తెలియడం లేదన్న రేంజ్ లో రాసుకొచ్చారు.

 

 

ఇంతకూ ఆర్కే ఏమంటున్నారంటే.. “కొన్ని విషయాలలో మాత్రం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే తెలివిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలు ఏర్పాటుచేసి వారికి అనధికారికంగా అధికారాలు కట్టబెట్టారు. దీంతో ఆయనకు చెడ్డపేరు వచ్చింది. ఇది గమనించిన జగన్మోహన్‌రెడ్డి తెలివిగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారు. పార్టీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించి వారికి నెలకు ఐదు వేల రూపాయల వంతున ప్రభుత్వం ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. వారికి అధికారాలతోపాటు కొన్ని సేవా కార్యకలాపాలను అప్పగించడం ద్వారా విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.. అంటూ మెచ్చుకున్నారు.

 

 

అంతే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరహాలో జగన్ కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకున్నారట. ఈ కారణంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సైతం కుక్కిన పేనుల్లా పడి ఉంటున్నారట. న్యాయస్థానాలు శిక్ష విధించినా పర్వాలేదు అనుకుంటున్నారే గానీ, ముఖ్యమంత్రి తీసుకుంటున్న అభ్యంతరకర నిర్ణయాలను మాత్రం కాదనలేకపోతున్నారట. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. ఇదంతా పొగిడినట్టే ఉంటుంది కానీ.. కాస్త లోతుగా పరిశీలిస్తే.. జగన్ దుర్మార్గుడు సుమా అన్న అర్థం వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవడంలో ఆర్కే ఏమాత్రం నిర్లక్ష్యం వహించరన్న విషయం బోధపడుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: