ప్ర‌భుత్వంలో ఉన్న‌వారు చేసే ప్ర‌తి ప‌నికీ ఓ నిర్దుష్ట‌త ఉంటుంది. ప్ర‌భుత్వంలో ఉన్న పార్టీ ఏం చేసినా.. ప్ర‌జ‌లు నిశితంగా గ‌మ‌నిస్తారు. పైకి మాట‌లు చెప్ప‌డ‌మే కాదు.. చేత‌ల్లోనూ ఆ హుందాత‌నం చూపించాలి. ఇది కోల్పోతే.. ఏకంగా అధికారానికే ఎస‌రొచ్చే ప‌రిస్థితి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ విష‌యం లోనే జ‌గ‌న్ చాలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌జ‌ల‌కు ఏమ‌వ‌స‌ర‌మో.. వారు ఏం కోరుకుంటున్నారో.. ప్రా థ‌మిక స్థాయిలో ఆయ‌న గుర్తించారు. ఈ క్ర‌మంలో త‌ను ఏడాదిన్న‌ర‌కు పైగా నిర్వ‌హించిన పాద‌యాత్ర లో ప్ర‌జ‌ల మ‌నసుల్లో ఏముందో ప‌సిగ‌ట్టారు.

 

ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో .. గుర్తించారు. దానికి ప్ర‌ధానంగా పెద్ద‌పీట వేశారు. నిజానికి ప్ర‌జ‌లు కోరుకు నేది.. ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు అందే సేవ‌లు నిస్వార్థంగా అందాల‌నే. అయ‌న దానికి, కానిదానికి లంచా లు తీసుకుంటూ.. వేధించ‌డాన్ని మెజారిటీ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. దీనిని గ‌మ‌నించిన జ‌గ‌న్‌.. త‌న పాల‌న ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. తాను ఏయే ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల‌కు చేరువైన‌ప్ప‌టికీ.. ఒక్క పైసా కూడా లంచం లేకుండా ప‌నులు జ‌ర‌గాల‌ని కోరుకున్నారు. ఈ విష‌యంలో తాను సీఎంగా ప్ర‌మాణం చేసే రోజునే ఆయ‌న సంక‌ల్పం చెప్పుకొన్నారు.

 

చెప్పిన‌ట్టుగానే ఆయ‌న ముందు పైస్థాయి నుంచి విష‌యాన్ని సంస్క‌రించే ప‌నిచేప‌ట్టారు. మంత్రులను తొలుత గ‌ట్టిగానే హెచ్చ‌రించారు. ఎవ‌రైనా అవినీతికి పాల్ప‌డితే.. వెంట‌నే ప‌క్క‌న పెట్టేయ‌డం ఖాయ‌మ‌ని గ‌ట్టి సందేశం పంపారు. అదేస‌మ‌యంలో ఉన్న‌త‌స్థాయిలో అధికారుల్లోనూ మార్పు తీసుకువ‌చ్చారు. నేరుగా త‌న కార్యాల‌యానికే ఫోన్ క‌నెక్ష‌న్ ఏర్పాటు చేసుకున్నారు. ఎవ‌రైనా ఎక్క‌డైనా లంచం డిమాండ్ చేస్తే.. వెంట‌నే త‌న‌కు ఫోన్ చేయాల‌ని పిలుపునిచ్చారు. అంతేకాదు... గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ఎవ‌రైనా అధికారి లంచం తీసుకుంటే..

 

దీనిపై ఫిర్యాదు అందితే.. పోలీసులు రంగంలొకి దిగి.. స‌ద‌రు మొత్తాన్ని బాధితుడికి తిరిగి ఇప్పించారు. అంతే త‌ప్ప చ‌ర్య‌లు తీసుకునేవారు కాదు. కానీ, జ‌గ‌న్ అలా కాకుండా వెంట‌నే విధుల్లోంచి త‌ప్పించే అంశాన్ని తెర‌మీదికి తెచ్చారు. ప‌లితంగా అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకుని.. జ‌గ‌నే తాజాగా చెప్పిన‌ట్టు లంచం అంటేనే కింది స్థాయి నుంచి పైస్థాయి వ‌ర‌కు ఒణికి పోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇది కూడా జ‌గ‌న్ ఏడాది పాల‌న‌లో వ‌చ్చిన సంచ‌ల‌న మార్పుగా జాతీయ మీడియా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: