తెలుగునాట మీడియా సంస్థలు రాజకీయ పార్టీల అనుబంధ సంస్థల్లా మారిపోయాయని ఎప్పటి నుంచో విమర్శ ఉంది. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ టీవీ, టీవీ5 వంటివి తెలుగుదేశం అనుకూల మీడియాగా ముద్రపడ్డాయి. మరోవైపు సాక్షి మీడియా అంటే పేపర్ టీవీ రెండూ.. వీటితో పాటు ఎన్టీవీ కూడా జగన్ అనుకూల మీడియా పేరుంది. ఎన్టీవీ మరీ సాక్షి రేంజ్ లో కాకపోయినా జగన్ వ్యతిరేక వార్తలు లేకుండా జాగ్రత్త పడుతుందన్న పేరుంది.

 

 

ఇక ఆంధ్రజ్యోతి మీడియా సంగతి చెప్పనవసరం లేదు. సాక్షి అయినా జగన్ సొంత పత్రిక కాబట్టి ఆ మాత్రం డప్పు వాయిస్తుందంటారు కానీ.. ఇక ఆంధ్రజ్యోతి మీడియా మాత్రం చంద్రబాబుకు సొంత మీడియా లేని లోటు తీరుస్తూ ఉంటుందన్న పేరు సంపాదించుకుంది. అయితే ఇటీవల ఓ విచిత్రం చోటు చేసుకుంది. అదేంటంటే.. ఆంధ్రజ్యోతి మీడియా వైఖరి అర్థం కాకుండా ఉందంటున్నారు విశ్లేషకులు. జగన్ అన్నా.. వైసీపీ అన్నా ఓ రేంజ్ లో విరుచుకుపడే ఆంధ్రజ్యోతి మీడియా జగన్ సన్నిహితుడైన వైసీపీ కీలక నేత విజయసాయి అన్నా అదే రేంజ్ లో విరుచుకుపడుతుంటుంది.

 

 

అందుకే విజయిసాయిరెడ్డికి సంబంధించి నెగిటివ్ వార్తలే తప్ప పాజిటివ్ వార్తలు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ లో కనిపించవు. అంతే కాదు.. వైసీపీ నాయకుల లైవ్ ప్రసారాలు కూడా పెద్దగా ఏబీఎన్‌లో ప్రసారం కావు. అలాంటిది మొన్నటికి మొన్న విజయసాయిరెడ్డి విశాఖలో ప్రెస్ మీట్ పెడితే ఏబీఎన్ ఛానల్ లైవ్ టెలికాస్ట్ చేసింది. అందులోనూ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నా.. లైవ్ కట్ చేయకుండా అలాగే ప్రసారం చేసింది. ఇదో ప్రపంచ వింతగానే చెప్పాలి.

 

 

ఇక మరో విషయం ఏంటంటే.. జగన్ అనుకూల ఛానల్ గా పేరున్న ఎన్టీవీలో విజయసాయిరెడ్డి జగన్ కు దూరమవుతున్నాడంటూ స్టోరీ ప్రసారమైంది. సాక్షాత్తూ విజయసాయిరెడ్డి స్వయంగా దాన్ని ఖండించాడు. లైవ్ లో ఎన్టీవీ పేరు పెట్టి మరీ విమర్శించారు. పసుపు మీడియా అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎన్టీవీ నాపై ఇలా ఎందుకు స్టోరీ వేసిందో అంటూ విజయసాయిరెడ్డి ఆశ్చర్యపోయారు. ఇదంతా చూసి అసలు మీడియాలో ఏం జరుగుతుందో అంటూ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: