లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాల పనితీరుపై సీ ఓటర్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది.. మోస్ట్ పాపులర్....లీస్ట్ పాపులర్ సీఎంల జాబితా విడుదల చేసింది. ఈ సర్వేలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కంటే వెనుకపడ్డారు. ఈ సర్వే ప్రకారం ముఖ్యమంత్రుల్లో పాపులర్ కేటగిరీలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి నాల్గోవ స్థానాన్ని ఇవ్వగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ 54.22శాతంతో ఎనిమిదవ స్థానంలో నిలిచారు.

 

బెస్ట్ సీఎం ఎవరని ప్రశ్నించగా ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, మరియు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు 82.96శాతంతో నవీన్ పట్నాయక్ తొలిస్థానంలో నిలిచారు. భూపేష్ భగేల్  81.06శాతంతో రెండో స్థానంలో నిలిచారు. అలాగే మూడో స్థానంలో కేరళ సీఎం పినరయి విజయన్‌కు చోటు దక్కింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో 3వేల మంది నుంచి అభిప్రాయ సేకరణ చేసింది.

 

అయితే ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రం ప్రజలు అగ్రతాంబూలం ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధానిగా మోడీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలకు ప్రజలు హ్యాట్సాఫ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీల మధ్య ప్రజలకు ప్రశ్నలు సంధించగా… 66.2శాతం మంది మోడీ వైపు నిలిచారు. మరోవైపు రాహుల్ గాంధీకి 23.21 శాతం మంది మాత్రమే అండగా ఉన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పనితీరు పట్ల వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్పందన కూడా విచిత్రంగానే ఉంది. గతంలో మోడీ ప్రభుత్వ పనితీరుపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది. కానీ, ఈ సారి కేంద్రం పనితీరును మెచ్చిన టాప్ రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ ఉన్నట్లుగా సీఓటర్ సర్వే వెల్లడించింది. 83 శాతానికిపైగా దక్షిణాది ప్రజలు మోడీ సమర్థతను ప్రశంసించారని సీఓటర్ సర్వే చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: