ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న కేబినెట్ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వ‌ర‌కు ఎవ్వ‌రు అవినీతి చేసినా.. రూల్స్ అతిక్ర‌మించినా ఎంత మాత్రం ఊరుకోవ‌డం లేదు. ఈ విష‌యంలో ఎంత‌టి వారిని అయినా వ‌ద‌ల‌డం లేదు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన రోజు నుంచే ఈ విష‌యాన్ని నొక్కి వ‌క్కాణిస్తున్నారు. ఇప్ప‌టికే చిన్నా చిత‌కా అవినీతికి పాల్ప‌డిన న‌లుగురైదుగురు మంత్రుల‌కు వార్నింగ్ ఇవ్వ‌డంతో మిగిలిన మంత్రులు అంద‌రూ ఎలెర్ట్ అవుతున్నారు. ఎవ్వ‌రూ కూడా అవినీతి చేసేందుకు ఎంత మాత్రం సాహ‌సించ‌డం లేదు. ఇక ఎమ్మెల్యేలు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని మ‌రీ ప‌ని చేస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే జ‌గ‌న్ కేబినెట్లో బాగా సీనియ‌ర్ అయిన ఓ మంత్రి వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుతో ఆయ‌న‌కు జ‌గ‌న్ ప‌లుసార్లు అక్షింత‌లు వేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ఓ సీనియ‌ర్ నేత గ‌తంలో వైఎస్ హ‌యాంలో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు కుల స‌మీక‌ర‌ణ‌లు, కాలం క‌లిసి వ‌చ్చి మళ్లీ చాలా ఏళ్ల‌కు ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వ‌డంతో పాటు జ‌గ‌న్ పై అనేక ఒత్తిళ్లు పెట్టి చివ‌ర‌కు మంత్రి అయ్యారు. అయితే ఆయ‌న మంత్రి అయిన ప్ప‌టి నుంచి యేడాది కాలంలోనే త‌న తీరుతో అనేక సార్లు పార్టీ నేత‌ల‌కు త‌ల‌నొప్పిగా మారారు.

 

ఒక్కోసారి ఇత‌ర మంత్రుల శాఖ‌ల్లో వేలు పెట్ట‌డం ఒక మైన‌స్ అయితే.. ఆయ‌న త‌న ప‌క్క నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలు పెట్టేస్తూ వైసీపీ ఎమ్మెల్యేల‌కు.. వైసీపీ నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారుతున్నార‌ట‌. ఈ విష‌యంపై జ‌గ‌న్‌కు.. ఉభ‌య గోదావ‌రి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ వైవి. సుబ్బారెడ్డికి అనేక ఫిర్యాదులు వెళ్ల‌డంతో జ‌గ‌న్ చాలా సార్లు వార్నింగ్ ఇచ్చార‌ని స‌మాచారం. ఇక ఇప్పుడు ప‌రిస్థితి తీవ్రం కావ‌డంతో అన్నా మీకు ఇప్ప‌టికే చాలా సార్లు చెప్పి చూశాను.. మీరు మార‌డం లేదు... కేబినెట్లో ఉంటారా ?  బ‌య‌ట‌కు వెళ‌తారా ? అని తీవ్రంగా హెచ్చ‌రించిన‌ట్టు కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

 

ఇక ఇప్ప‌టికే మోపిదేవి, పిల్లి రాజ్య‌స‌భ‌కు వెళుతుండ‌డంతో ఆ స్థానంలో ఖాళీ అయ్యే రెండు కేబినెట్ బెర్త్‌ల‌తో పాటు మ‌రి కొంద‌రిని త‌ప్పించి ఆ స్థానంలో కొత్త‌వారిలో కేబినెట్ భ‌ర్తీ ఉంటుంద‌ని కూడా టాక్‌..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: