జగన్ ఏపీ సీఎంగా నూటికి నూరు మార్కులు వేయించుకున్నాడు. ప్రజల్లో ఆయన మీద అదే స్థాయిలో నమ్మకం పెరిగింది. ఎందుకంటే తాను ప్రకటించిన అన్ని హామీలను అమలు చేసి తాను మాటల ముఖ్యమంత్రి కాదు, చేతల ముఖ్యమంత్రిని అని నిరూపించుకున్నాడు. దేశ వ్యాప్తంగా జగన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు సాధించడంతో పాటు, ఏపీలో జగన్ అమలు చేసిన, చేస్తున్న అనేక నిర్ణయాలను మిగతా రాష్ట్రల వారు కూడా అనుసరించే విధంగా అందరికి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు. ఇక పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అవినీతి అనేది ఎక్కడా పెరగకుండా చూసుకుంటున్నారు. ప్రతి పనిలోనూ పారదర్శకత కోరుకుంటూ జగన్ ముందుకు వెళ్తున్న తీరు, గతంలో ఏ ముఖ్యమంత్రి జగన్ స్థాయిలో పని చేయలేదు అనే ఖ్యాతి జగన్ సంపాదించుకోగలిగారు.

IHG


నేను ఐదేళ్లు కాదు ముప్ఫైయేళ్ల ముఖ్యమంత్రిని అంటూ జగన్ చెబుతూనే ప్రజల మనసు గెలుచుకుంటూ, తన భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా కొన్ని కొన్ని విషయాల్లో జగన్ తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు చేటు తీసుకురావడంతో పాటు ఆయన ప్రజల్లో అభాసుపాలు అయ్యే విధంగా తయారయ్యాయి. 
జగన్ నిర్ణయాలు ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతోనే తీసుకుంటున్నా, వాటి అమలులో ఇబ్బందులు, నియమ నిబంధనలు ఇవేమి పట్టించుకోకుండా జగన్ దూకుడుగా ముందుకు వెళ్తుండడం కూడా జగన్ కు ఇబ్బందులు తెస్తున్నాయి. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి జగన్ కోర్టుల్లో ఇబ్బందుకు ఎదురవుతూనే ఉన్నాయి.

IHG

 

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, రాజధాని అమరావతి తరలింపు, మూడు రాజధానుల ఏర్పాటు, ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, ప్రభుత్వ భవనాలకు రంగులు వేయడం, విశాఖ మత్తు డాక్టర్ సుధాకర్ విషయం ఇలా చెప్పుకుంటూ వెళ్తే జగన్ కు అన్ని విషయాల్లోనూ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసలు కోర్టు ఇబ్బందులు రాకుండా ముందుగానే అన్ని పరిశీలించుకుని, న్యాయ నిపుణుల సలహాలతో జగన్ నిర్ణయాలు తీసుకుంటే కోర్టుల్లో చిక్కులు తప్పడమే కాకుండా ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రతిపక్షాలు వేలెత్తి చూపించకుండా అవకాశం ఏర్పడేది. 

IHG


కానీ జగన్ మాత్రం ఆ విధంగా వ్యవహరించకుండా అనవసర తలనొప్పులు తెచ్చుకుంటున్నాడు అనే భావన సొంత పార్టీ నాయకుల్లోనూ ఇప్పుడు కలుగుతోంది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు పోలిన రంగులు వేయడంపై హైకోర్ట్ తప్పు పట్టింది. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టు కి వెళ్లడంతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని అంతా ఆశపడగా ఇప్పుడు సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. గ్రామ పంచాయితీ కార్యాలయాలకు వేసిన రంగులను నాలుగు వారాల్లోగా రంగులు తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ లావు నాగేశ్వర్ రావు తో కూడిన ధర్మసనం డిస్మిస్ చేసింది. అంతే కాదు నాలుగు వారాల్లో తొలగించకపోతే, కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ధర్మసనం హెచ్చరించింది.  

 

 ఇప్పటి  వరకు జరిగింది ఏదో జరిగినా ఇకపై కోర్టుల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి నిర్ణయాన్ని ఆచి తూచి తీసుకుంటే రానున్న రోజుల్లో జగన్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అలా కాకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది అంటూ జగన్ కు సూచనలు అందుతున్నాయి. మరి రానున్న రోజుల్లో అయినా జగన్ వైఖరిలో మార్పు వస్తుందో లేదో చూడాలి.

 

    

మరింత సమాచారం తెలుసుకోండి: