ఏం చెప్పినా తెలుగు మీడియా అనేది కులాలు.. పార్టీలు.. వ‌ర్గాలు.. ఇలా ర‌క‌ర‌కాలుగా చీలిపోయింది. మా కులం వాడు సీఎం కాబ‌ట్టి మేం వాడికే స‌పోర్ట్ చేస్తామ‌ని కొంద‌రు అంటారు.. కాదు కాదు మా కులం వాడి పార్టీ కాబ‌ట్టి మా ఛానెల్ వాడికే స‌పోర్ట్ అని మ‌రి కొంద‌రు అంటారు.. మీడియాలో ప్ర‌మోష‌న్లు.. కీ పోస్టులు అన్ని ప్ర‌తిభ కంటే కులాల‌ను బేస్ చేసుకునే ఎక్కువుగా ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఇదే తెలుగు మీడియాను ఏపీ, తెలంగాణ‌లో విభ‌జించి చూపించిన‌ప్పుడు తెలంగాణ‌లో మీడియా అంతా వ‌న్ సైడ్‌గా సీఎం కేసీఆర్‌కు స‌పోర్ట్ చేస్తుంద‌నే చెప్పాలి. ఈ విష‌యంలో ఎలాంటి సందేహాలు అక్క‌ర్లేదు.

 

ఉదాహ‌ర‌ణ‌కు జ‌గ‌న్ సొంత మీడియా సాక్షి ఏపీలో ఎలాగూ జ‌గ‌న్ డ‌ప్పు కొట్టుకుంటుంది.. ఈ మీడియా తెలంగాణ‌లో న‌మ‌స్తే సాక్షి గా మారిపోయి మ‌రీ కేసీఆర్‌కు భ‌జ‌న చేస్తుంటుంది. అలాగే ఏపీలో జ‌గ‌న్‌పై తీవ్రంగా విరుచుకు ప‌డుతూ చంద్ర‌బాబుకు కొమ్ముకాసే టీవీ 5 కూడా తెలంగాణ‌లో కేసీఆర్ భ‌జ‌న చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ను విమర్శించే పత్రికలు తెలంగాణలో బూతద్దం పట్టుకుని వెదికినా కనిపించే పరిస్థితి లేదు. అంటే కేసీఆర్‌ను అక్క‌డ విమ‌ర్శించే మీడియా లేదు. 

 

అటు ఈనాడు రామోజీరావు కేసీఆర్‌కు జై కొడుతున్న ప‌రిస్థితి. చాలా రోజుల నుంచి కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేస్తోన్న జ్యోతి రాధాకృష్ణ ఇప్పుడు కేసీఆర్ కీర్త‌న‌లు స్టార్ట్ చేసేశాడు. ఇక ఏదో వెలుగు లాంటి ఒక‌టీ అరా పేపర్లు ఉన్నా అవి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అస‌లు ప్రింట్ కాని ప‌రిస్థితి. కానీ ఏపీలో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది ప‌రిస్థితి. టీవీ 5, ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ఏబీఎన్ ఇలా చెప్పుకుంటూ పోతే టాప్ మీడియా అంతా జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగానే ప‌ని చేస్తోంది. మ‌రి జ‌గ‌న్ అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన టీడీపీతో పాటు ఈ ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల‌పై కూడా నిత్యం యుద్ధం చేయాల్సి వ‌స్తోంది. 

 

అక్క‌డ కేసీఆర్ త‌న‌పై వ్య‌తిరేకంగా రాస్తే ఆయ‌న స‌హించ‌రు. అక్క‌డ మీడియా బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌దు. కానీ ఇక్క‌డ ఏపీలో జ‌గ‌న్ ఎంతో ధైర్యంగా మీడియాను ఎదుర్కొంటున్నాడు. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా పోక‌డ‌లు.. సీఎంలు వాటిని ఎదుర్కొంటోన్న తీరు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: