పంచాయతీ భవనాలకు రంగుల విషయంలో ఏపీ సర్కార్ కి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే..అయితే ఈ వ్యవహారంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'రంగులు మార్చాల్సిందే.. ప్రభుత్వం ఇచ్చే పాలనాపరమైన ఆదేశాలేవైనా న్యాయ సమీక్షకు లోబడే ఉంటాయి. కోర్టు తీర్పు పాటించకపోవడమంటే చట్టాన్ని ఉల్లంఘించడమే. మెజారిటీ వచ్చిన అహంకారంతో పాలకులు మూర్ఖంగా వ్యవహరించి వేలకోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారు దీనికేనా ఒకఛాన్స్ అడిగింది చెప్పండి  వైఎస్‌ జగన్ గారు' అని ట్విట్టర్‌లో నిలదీశారు. అలాగే ఇసుక కొరతపై జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ “ఇంటింటికి ఇసుకచేరవేతలో చేతివాటం యాప్ రూపకల్పనలో కిరికిరితో ఒకేబిల్లుపై 4,5ట్రిప్పులు చెప్పినట్రిప్పులు వేస్తేనే రవాణాకుఅనుమతి రీచ్ నుండి స్టాక్ యార్డ్ వరకు కొంతమంది మీమంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు సామాన్యుడికి దొరకకుండాచేస్తున్న ఇసుకదోపిడీకి ఏంసమాధానంచెప్తారు జగన్ గారు” అంటూ మరో ట్వీట్ కూడా చేశారు.

 

అయితే ఇక్కడ దేవినేని ఉమా ఒక విషయం మరిచినట్టున్నారు...మెజారిటీ వచ్చిన అహంకారమే జగన్ మోహన్ రెడ్డికి ఉండి ఉంటే రాష్ట్ర రాజకీయ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ, తన పాదయాత్రతో ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసినవాడు కాబట్టి ఎందరు విమర్శిస్తున్నా పట్టించుకోకుండా సంక్షేమ పథకాలకు పెద్ద పీఠ వేస్తూ...ప్రజాక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన హామీల్లో 90 శాతం పూర్తి చేసి చూపించారు. అయితే ఇంత అనుభవం కలిగిన ఉమా లాంటి సీనియర్ నాయకుడు “దీనికేనా ఒకఛాన్స్ అడిగింది చెప్పండి  వైఎస్‌ జగన్ గారు” అనడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆయన ఈ ఒక్క ఛాన్స్ అడిగిన సంవత్సరంలోనే ఎన్నో అభివృద్ధి చేసి చూపించారు. కానీ, ఎంత సేపటికి అధికారపక్షాన్ని వేలెత్తి చూపాటమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్ష నాయకులకు మాత్రం ఇవేం పట్టవు కదా. రంగుల విషయంలో తమ పాలన ముద్ర రాష్ట్రంలో ఉండాలన్న చిన్న ఆశతో, సలహదారుల సలహాతో ఆయన ఇలా చేశారని స్పష్టంగా తెలుస్తుంది. ఏమైనప్పటికి కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రంగులు తొలగించాల్సిందే. కోర్టులను గౌరవించే సీఎం జగన్ మోహన్ రెడ్డి లాంటి వారు కోర్టు ఆదేశాలను అతిక్రమించరని ప్రతిపక్షాలు తెలుసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: