``భార‌త దేశ‌ము నా మాతృభూమి.. భార‌తీయులంద‌రూ నా స‌హోద‌రులు``- చిన్న‌ప్పుడు స్కూల్లో చేసిన ప్ర‌తిజ్ఞా పాఠం గుర్తుకు వ‌స్తే.. క‌న్నీళ్లు అస్స‌లాగ‌వు! ఎలాంటి దేశం.. ఎలాంటి ఔన్న‌త్యం అనిపిస్తుంది.. అ ప్ర‌య‌త్నంగా! ఇంత‌లోనే.. పాదంకింద నేలేదో క‌దులుతున్నట్టు.. గుండె క‌లుక్కుమంటుంది!! ఇంత సువిశాల భార‌త దేశంలో.. ఇంత పెద్ద రాజ్యాంగం.. అంత‌క‌న్నా పెద్ద ఆద‌ర్శాలు.. ఉన్న దేశంలో.. ఎక్క‌డో ఎవ‌రో.. ఏదో క‌దిలిస్తే.. ఎక్క‌డో ఏవో.. కొన్ని వ్య‌వ‌స్త‌లు క‌దిలిపోయి.. ఎక్క‌డో ఏవో అనేక మార్పులు వాటంత ‌టవే వ‌చ్చేస్తాయి! వ‌డ్డించేవాడు మ‌నోడైతే.. చాలు లాస్ట్ బంతిలో కూర్చున్నా.. లొట్ట‌లేసుకుని తినేయొచ్చ న్న విధంగా!

 

దేశంలో వ్య‌వ‌స్థ‌.. అవ‌స్థ‌గా మారింద‌నే వ్యాఖ్య‌లు గ‌డిచిన ద‌శాబ్ద‌కాలంగా వింటూనే ఉన్నాం. అనుకున్న  ప్పుడల్లా ఓ నిట్టూర్పు విడిచి.. క‌న్నీటి బొట్టు(వ‌స్తే) రాల్చి.. ఓ గంట చ‌ర్చించుకుని.. చాప‌చుట్టేస్తాం..!(ఇంత‌క‌న్నా ఏం చేయ‌గ‌లం?) వ్య‌వ‌స్థ‌లు ఉన్న‌ది ఎందుక‌యా? అని నాబోటి గాడు ఎవ‌డైనా.. ప్ర‌శ్నిస్తే.. ``బ‌క్క‌చిక్కిన మీబోటి గాళ్ల‌కు స్వాతంత్య్ర ఫ‌లాలు అందించుట‌కు. ఈ దేశంలోని మార్మూల ప‌ల్లెలు.. తండాల్లో వ‌శించే అణ‌గారిన వ‌ర్గాల‌ను ఆదుకునేటందుకు. వెనుక బ‌డిన సామాజిక వ‌ర్గాల‌కు న్యాయం చేసేటందుకు. వ్య‌వ‌స్థ‌ల‌ను మ‌న ``పెద్ద‌లు`` తీర్చిదిద్దినార‌నుట మ‌హ‌దానంద‌కందాయ‌ము!``-అని కందుకూరి వారి పాఠం ఛ‌టుక్కున వ‌ల్లించేస్తారు.

 

మ‌రి ఆ పెద్ద‌లే వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసి.. అవ‌స్థ‌ల‌కు దారితీసేలా వ్య‌వ‌హ‌రిస్తే..?!-ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం లేదు. టాఠ్‌! నువ్వు ధిక్కరిస్తున్నావ్‌! జాగ్ర‌త్త‌!?- అంటూ ఘీంక‌రింపులు ష‌రా!! మేం నిజాం జ‌మానాల్లోనో.. నియంత‌ల పాల‌న‌ల్లోనో లేము స్వామీ.. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం.. కావాలంటే.. నా ఎడం చేతి చూపుడు వేలు చూసుకోండి ఓటేశానో లేదో తెలుస్తుంది! అన్నా కూడా ప‌ట్టించుకునే దిక్కులేకుండా పోయిన అతి పెద్ద ప్ర‌జాస్వామ్యంలో మ‌నం ఉన్నాం. ఏపీ ప్ర‌భుత్వం భారీ మెజారిటీతో కొలువుదీరింది. బ‌హుశ ఈ దేశం లో ఒక‌టి రెండు రాష్ట్రాల్లోనే ప్రాంతీయ పార్టీలు ఇంత‌గా దుమ్మురేపిన సంద‌ర్భాలు మ‌న‌కు క‌నిపిస్తాయి.

 

సో.. 175 మంది ఎమ్మెల్యేల్లో 151 మందిని జ‌గ‌న్‌కు క‌ట్ట‌బెట్టారు ప్ర‌జ‌లు. అంటే.. ఆయ‌నకు భారీ ఎత్తున ప్ర జ‌లు జై కొట్టార‌నే అనుకోవాలి. అయితే, ఈ ప‌రిణామం.. వైసీపీకి న‌చ్చుతుందే త‌ప్ప‌.. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం గా ఉన్న టీడ‌పీకి కానీ, ఎద‌గాల‌ని డింకీలు కొడుతున్న బీజేపీకి కానీ, ఇంకా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న జ‌న ‌సేన‌కు కానీ న‌చ్చుతుందా?! ఒక్క‌నాటికి న‌చ్చ‌దు. అందుకే ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలి నాలుగు మాసాల్లోనే మాట‌ల‌తో జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. అనేక ఉద్య‌మాలు చేశారు. నిరాహార దీక్ష‌ల‌కు కూర్చున్నారు(బాబు చేసిన ఇసుక దీక్ష వంటివి). అయినా.. అదో(జ‌గ‌న్‌) మొండి ఘ‌టం.. పైగా రాగి సంక‌టి తిన్న బాడీ ఏమో.. ప్ర‌జ‌ల  ప్ర‌యోజ‌న‌మే త‌ప్ప‌.. ప్ర‌తిప‌క్షాల ప్ర‌యోజ‌నం అక్క‌ర్లేద‌నే గుర‌జాడ వారి గిరీశం టైపు!

 

ఢీ- అంటే ఢీ అనేటైపులో బాహుబ‌లి మాదిరిగా వెన్ను చూప‌ని వ్య‌క్తిత్వం. అందుకే ఏ విష‌యాన్న‌యినా సాధించే త‌త్వంతో నే ముందుకు సాగుతున్నాడు సీఎం జ‌గ‌న్‌. మ‌రి ప్ర‌తిప‌క్షాలే మ‌న్నా.. నోట్లో  వేలేసుకు ని కూర్చుంటాయా?  పైగా ప్ర‌పంచానికి పొలిటిక‌ల్‌ పాఠాలు నేర్పాన‌ని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్ర బాబు చూస్తూ.. ఊరుకుంటారా?. క‌ళ్ల‌లో నిప్పులు పోసుకోరూ.. అందుకే.. ఆయ‌న వ్య‌వ‌స్థ‌ల‌ను క‌దిలిస్తున్నా రు! ఆ వ్య‌వ‌స్థ‌లు ఏవైనా కావొచ్చు.. ఇంట్లో కూర్చొని బ‌ట‌న్ నొక్కితే.. ఎక్క‌డో ఉన్న డ్రోన్ క‌దిలిన‌ట్టుగా.. చంద్ర‌బాబు కూడా త‌న హైటెక్ రాజ‌ప్రాసాదంలో కూర్చుని ఒక్క ఫోన్ కాల్‌తో వ్య‌వ‌స్థ‌ల‌ను న‌డిపించే యాంత్రాంగాన్ని చేతుల్లో పెట్టుకున్నార‌ని అంటారు.

 

కాంత‌.. క‌నకం.. కీర్తి.. వీటిలొ ఏదో ఒక‌దానికి లొంగ‌ని వ్య‌క్తి ఉంటారా? అస‌లు ఉంటే.. వ్య‌క్తే కాదంటారు గుడిపాటి వెంక‌ట‌చ‌లం వారు! సో.. అన్ని రంగాల్లోనూ అన్ని వ్య‌వ‌స్థ‌ల్లోనూ ఇలాంటి వ్య‌క్తులు తిష్ఠ‌వేశారు. వీరే క‌దా.. బాబుకు కావాల్సింది కూడా! ఇలానే న్యాయ వ్య‌వ‌స్థ‌లోనూ కొంద‌రు ఉన్నార‌నేది గ‌తంలో ఎన్నో విష‌యాల్లో మ‌న‌కు క‌నిపించింది. తీర్పుల విష‌యంలో అనుకూలంగా చెప్పేందుకు లంచాలు పుచ్చుకుని జైలు పాలైన న్యాయ‌మూర్తులు తెలుగు నాటే మ‌న‌కు గనుల కేసులో క‌నిపించారు క‌దా! 

 

ఒక‌రు డ‌బ్బుకు లొంగిపోయి ఉండొచ్చు.. మ‌రికొంద‌రు కీర్తి కోసం.. లొంగిపోయి ఉండొచ్చు.. ఇప్పుడు ఇవే చంద్ర‌బాబుకు బాస‌ట‌గా మారాయి. అలాంటి వారు ఇందుగ‌ల‌డందులేర‌నే సందేహం లేకుండా ఢిల్లీలో నూ ఉన్నారు. సో.. మొత్తానికి చెప్పొచ్చేదంటంటే.. స‌ద‌రు వ్య‌క్తులు.. మ‌రో నాలుగేళ్ల‌పాటు ఢిల్లీలోనే ఉంటారు. కాబ‌ట్టి.. జ‌గ‌న్‌కు ఎదురు దెబ్బ‌లు మామూలే..! చంద్ర‌బాబు వ్య‌వ‌స్థ‌లు మేనేజ్ చేయ‌డ‌మూ మామూలే!! కాబ‌ట్టి.. నాబోటి గాళ్లు.. అనాల్సింది ఒక్క‌టే.. న్యాయ‌వ్య‌వ‌స్థ జిందాబాద్‌!

మరింత సమాచారం తెలుసుకోండి: