తెలంగాణ సీఎం కేసీఆర్ ఎవరికీ భయపడే రకం కాదు. తానే అందరినీ భయపెట్టే రకం.  పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, రాజకీయ ప్రత్యర్థుల విషయంలోనూ కేసీఆర్ వ్యవహారం ఇలాగే ఉంటుంది. అటువంటి కేసీఆర్ కూడా భయపడే ఓ వ్యక్తి తెలంగాణాలో ఉన్నారు. ఆమె ఒక సాధారణ లాయర్. తన లాయర్ బుర్రతోనే అంతటి కేసీఆర్ ను సైతం వణికించేస్తున్నారు. ఇంతకీ ఆమె పేరు చెప్పనే లేదు కదూ రచనా రెడ్డి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఆమె కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగా ఉంటూ వస్తున్నారు.  
భూ నిర్వాసితుల తరఫున పోరాటం చేయడం, ప్రభుత్వ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూనే ఆమె వస్తోంది. నిర్వాసితుల తరఫున ఆమె కోర్టుల్లో కేసులు వాదిస్తూ ప్రభుత్వ పెద్దలను ఇబ్బందులకు గురి చేస్తోంది. నిర్వాసితుల తరఫున పోరాటం చేస్తున్న రచనా రెడ్డి పేరు చెబితేనే కేసీఆర్ ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారు. 

IHG

భూసేకరణ చట్టంపై చర్చ సందర్భంగా అనేక సందర్భాల్లో కేసీఆర్ ఆమె పేరును పదేపదే ప్రస్తావించారు. ఆమె గురించి ఓ సందర్భంలో అసెంబ్లీలో కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు అంటే ఆమెకు కెసిఆర్ ఎంత భయపెడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో కేసీఆర్ ని ఎదిరించి నిలబడుతున్న సాహసోపేతమైన మహిళగా ఆమె కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అప్పట్లో తెలంగాణ జన సమితి నుంచి ఆమె అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రయత్నించి చివరి నిమిషంలో విరమించుకున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఆమె పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. కానీ తెరవెనుక మాత్రం తన పోరాటం కొనసాగిస్తోంది. తాజాగా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

 


 ఆ కేసును వాదించింది రచన రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడిన ఈ తీర్పు రావడానికి ఆమె తీవ్రంగానే  కసరత్తు చేశారు. ఈ కేసులో తీర్పు ఎంత వేగంగా రావడానికి కారణం రచన రెడ్డి. కేసు తీర్పు వాయిదా కోసం అడ్వకేట్ జనరల్ ఇప్పుడు తొందరేముంది కరోనా వ్యవహారం చెక్కబడిన తర్వాత చూద్దాం , ఈ వీడియో ద్వారా విచారణ దేనికి అంటూ నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా ఆ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు దాకా దీన్ని పాటిస్తున్నాయి, వాయిదాలు వేస్తూ వెళ్తే పదేళ్లయినా కేసు నడుస్తూనే ఉంటుంది అని  వ్యాఖ్యానించింది. భూసేకరణ పరిహారంకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా వేరే జీవో ఇచ్చింది. తరువాత వాటిని మార్చింది. ప్రత్యేక చట్టం తీసుకువచ్చింది. 

 

IHG's largest ...


ఇలా ఎన్ని చేసినా, 2013లో కేంద్ర భూసకరణ చట్టం ఫైనల్ అంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటిదాకా ఇచ్చిన పరిహారాలు అలాగే ఉంచి, ఆ చట్టం మేరకు మళ్లీ లెక్కగట్టి మిగతా సొమ్ములు మూడు నెలల్లోగా చెల్లించాలంటూ తీర్పు చెప్పింది. అధికారం వినియోగించే టప్పుడు పారదర్శకంగా ఉండాలి కానీ, ఈ పరిహారం కేసుల్లో అధికారుల పాత్ర విశ్వాసాన్ని దెబ్బ తీసే ఎలా ఉందని వ్యాఖ్యానించింది. అధికారుల తీరు అన్యాయమని అభిప్రాయపడింది. భయపెట్టే విధంగా ఒప్పందాలు చేసుకోవడం రాజ్యాంగ విరుద్ధం అంటూ వ్యాఖ్యానించింది. ఈ విధమైన తీర్పు రావడానికి కారణమైన రచనా రెడ్డి మళ్లీ ఫామ్ లోకి రావడం నిజంగా కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి ఆందోళన కలిగించే అంశమే.

మరింత సమాచారం తెలుసుకోండి: