జగన్ సర్కార్ పై బురద చల్లడానికి ప్రతిపక్షాలకు దొరికిన మరో అస్త్రం కరోనా. రాష్ట్రంలో కరోనాను కట్టడిచేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కిట్ల కొనుగోలులో అక్రమాలు జరిగిగాయని, పరీక్షలు నిర్వహించడంలో ఫెయిల్ అయ్యారని.. అలాగే కేసులను దాచిపెట్టి చూపిస్తుందని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షం మాటలను పట్టించుకోకుండా కరోనా కట్టడిని ఒక సవాల్ గా తీసుకొని పనిచేస్తుంది... ప్రతీ రోజూ 12 వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహిస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.

 

బుధవారం నాటికి 4 లక్షల కరోనా పరీక్షలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో 8,066 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడంతో బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా చేసిన టెస్టులు 4,03,747కి చేరడంతో కరోనా వైద్య పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో కీలక మైలురాయిని అందుకుంది. అలాగే పరీక్షల నిర్వహణతో పాటుగా జిల్లాల వారీగా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలన్నీ అందిస్తున్నట్లు ఏపీ కరోనా నోడల్ ఆఫీసర్ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 4 లక్షల కరోనా టెస్టులు చేసిన రాష్ట్రాలు మూడు (రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర) మాత్రమే ముందున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల జనాభాతో పోల్చుకుంటే ఏపీలో జనాభా చాలా తక్కువ. దీంతో ప్రతి 10 లక్షల మందికి చేసే కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. ప్రతి 10 లక్షల జనాభాకు రాష్ట్రంలో సగటున 7,419 మందికి వైద్య పరీక్షలు చేస్తున్నారు.

 

మరోవైపు రికవరీ రేటులో సైతం ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతంతో పోల్చితే రాష్ట్రంలో ఆ సంఖ్య చాలా ఎక్కువ. రాష్ట్రంలో రికవరీ రేటు 64 శాతం ఉండగా.. దేశ వ్యాప్తంగా చూస్తే 48.51 శాతంగా నమోదైంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొత్తం కేసుల సంఖ్య 3,971కు చేరింది. మొత్తం కేసుల్లో 573 వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు, 119 విదేశాల నుంచి వచ్చినవారివి. 55 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,456కు చేరింది. అలాగే కరోనాతో మరణించిన వారి సంఖ్య 68కు చేరుకుంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,447గా ఉంది. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌ మాదిరిగా ట్రూనాట్ మెషీన్లు ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ తరహాలో టెలి మెడిసిన్‌ను విస్తృతంగా అందుబాటులోకి తేవాలని ఇతర రాష్ట్రాలను ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: