ఎల్లోమీడియాలో ఓ విచిత్రమైన వార్త అచ్చయ్యింది. అదేమిటంటే ఇకపై ఢిల్లీ స్ధాయిలో నరేంద్రమోడి, అమిత్ షా తో పాటు ఏ కేంద్రమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డికి అపాయిట్మెంట్ ఇచ్చేముందు ఏపి బిజెపి కోర్ కమిటికి సమాచారం ఇవ్వాలట.  ఈ విషయం ఉన్నతస్ధాయిలో నిర్ణయమైందని కూడా ఎల్లోమీడియా చెప్పింది. సరే పనిలో పనిగా రాష్ట్ర గవర్నర్ బిస్వజిత్ హరిచందన్ పనితీరుపై ఢిల్లీ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని కూడా చెప్పింది. ఇకపై జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై సంతకాలు చేసేముందు ఢిల్లీని సంప్రదించకుండా గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఎల్లోమీడియాలో అచ్చయిన వార్త నిజమే అయితే నరేంద్రమోడి, అమిత్ షా, కేంద్రమంత్రులకన్నా ఏపి బిజెపి కోర్ కమిటి సభ్యులే చాలా బలవంతులన్న విషయంపై అనుమానాలు పెరిగిపోతోంది. లేకపోతే జగన్ కు అపాయిట్మెంట్ ఇవ్వటానికి ఏపి బిజెపి కోర్ కమిటి అనుమతించటానికి ఏమిటి సంబంధం ? జగన్ అపాయిట్మెంట్ కోరిన విషయాన్ని మోడి, అమిత్ షా, కేంద్రమంత్రులు ముందుగా కోర్ కమిటితో మాట్లాడాలని  డిసైడ్ అయ్యిందని చెప్పటం చాలా విచిత్రంగా ఉంది.

 

జగన్ను తక్కువ చేసి చూపాలనే ఆలోచనలో ఎల్లోమీడియా మోడి, అమిత్ షా, కేంద్రమంత్రుల స్ధాయిని బాగా దిగజార్చేసింది.  లేకపోతే జగన్ అపాయిట్మెంట్ కోరితే అది ముఖ్యమంత్రి హోదాలోనే ఉంటుంది కానీ పార్టీ అధ్యక్షుడి స్ధాయిలో ఉండదు కదా ? రెండు ప్రభుత్వాల మధ్య వ్యవహారంలో బిజెపి కోర్ కమిటి పెత్తనమేమిటి  విచిత్రం కాకపోతే. మోడి, అమిత్ షా మీద బిజెపి నేతలు ఆధారపడ్డారా లేకపోతే కోర్ కమిటి పైనే మోడి, షా ఆధారపడ్డారో అర్ధం కావటం లేదు. ఎల్లోమీడియాలో వచ్చిన వార్త ఎలాగుందంటే తోకే కుక్కను ఊపుతున్నట్లుంది.

 

నిజానికి రాష్ట్రంలోని చాలామంది బిజెపి నేతలకు అంతెందుకు అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకే అనుకున్నపుడల్లా ఢిల్లీలో అపాయిట్మెంట్లు దక్కవన్నది నిజం. కన్నా మాట్లాడాలని అనుకున్నా అమిత్ షా ఓకే అంటేనే సాధ్యమవుతుందన్న విషయం ఎల్లోమీడియా మరచిపోయింది. అలాంటిది ఓ సిఎంకు అపాయిట్మెంట్ ఇచ్చేముందు ఏపిలోని కోర్ కమిటి నుండి మోడి, అమిత్, కేంద్రమంత్రులు  సమాచారం తీసుకోవాలని ఉన్నతస్ధాయిలో డిసైడ్ అయినట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది.  మళ్ళీ ఉన్నతస్ధాయి అంటే ఎవరో చెప్పలేదు.  కేంద్రంలో కానీ పార్టీలో కానీ  మోడి, అమిత్ షా కన్నా ఉన్నతస్ధాయిలో ఎవరైనా ఉన్నారా ? అనే అనుమానాలు వస్తోంది ఎల్లీమీడియా రాతలు చూస్తుంటే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: