పచ్చని చెట్లు ఒక్క పిడుగుకు ఎలా మాడిపోతాయో అలాగే ఉంది ఇప్పుడు లోకం పరిస్దితి.. గత సంవత్సరం కరోనా అనే వైరస్ మొదలై క్రమ క్రమంగా అన్ని దేశాలకు ఈ ఆరు నెలల్లో విసృతంగా వ్యాపించి కలలో కూడా ఊహించని, ప్రాణ, ఆర్ధిక నష్టాలను కలిగిస్తుంది. దీని దాడికి పేద దేశాలు పూర్తిగా పేదరికంలోకి జారిపోతుండగా, సంపన్న దేశల మధ్య ప్రస్తుతం అయితే మాటల యుద్దాలు కొనసాగుతున్నాయి. ముందు ముందు ఈ పరిస్దితులు ఎన్ని ప్రమాదాలకు దారి తీస్తాయో తెలియదు..

 

 

ఇందులో కరోనాను అడ్డుపెట్టుకుని చైనా ఎన్నో జిత్తులను ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇదే సమయంలో ఆసియాలో ప్రస్తుతం కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థలో చిమ్మచీకట్లు నిండుకున్నాయని బ్లూమ్‌బర్గ్‌ ఓ రిపోర్టులో విశ్లేషించింది. ఇక అనేక వ్యాపారాలు ఈ వైరస్‌ సంక్షోభంతో నిలిచిపోయాయని.. దీంతో దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ వల్ల 130 కోట్ల మంది ప్రజలు తీవ్ర ప్రభావితం అవగా, లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని తెలిపింది. ఇక నిపుణులు కూడా ఈ పరిస్థితి నుంచి రికవరీ కావడానికి ఎంత సమయం పడుతుంతో సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారని వివరించింది.. అంతే కాకుండా ఆసియాలోనే మూడువ అతిపెద్ద ఆర్థిక వ్యవస్తగా ఉన్న భారత జీడీపీ 5 శాతం క్షీణించి.. గత నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని స్థాయికి పడిపోనుందని కొందరు పేర్కొంటుంటే.. మరికొందరు మాత్రం తిరిగి 8 శాతం పైగా వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

 

 

అయితే  క్రిసిల్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఎకనామిస్టు ధర్మక్రితి జోషి మాత్రం ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించి నాటి స్థాయికి జీడీపీ చేరాలంటే మరో మూడు సంవత్సరాల వరకు పట్టొచ్చని విశ్లేషించారు. ఇదిలా ఉండగా వాస్తవ జీడీపీలో 10 శాతం శాశ్వత నష్టం ఉండొచ్చని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా బ్లూమ్‌బర్గ్‌ సంస్ద గుర్తు చేసింది. ఇకపోతే దేశ జీడీపీ సగటున 2022-24 ఆర్ధిక సంవత్సరాల మధ్య 7 శాతం పెరుగొచ్చని అంచనా వేస్తుంది.. కాగా పరిస్దితులు ఇలాగే కొనసాగితే మాత్రం దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయంటు తెలిపింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: