వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వాయిస్‌ ను ఎమ్మెల్యే రోజా ఎంతలా వినిపించిందో అందరికీ తెలుసు. అయితే వివిధ సమీకరణాల వల్ల ఆమెకు సీఎం జగన్ కేబినెట్‌లో చోటు దక్కలేదు. పార్టీకి ఆమె అందించిన సేవలు గుర్తుంచుకున్న జగన్..  రోజాకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు.  ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు మరో కీలకమైన పదవీ బాధ్యతలు అప్పగించాలనే భావనలో సీఎం ఉన్నట్టు సమాచారం.

 

2019 సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుంచి రోజా గెలిచిన తర్వాత ఆమెకు మంత్రి పదవి ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ కాస్ట్ ఈక్వేషన్స్ కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆమెకు మంత్రి పదవితో సమానమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టాడు ఏపీ సీఎం జగన్. రోజా కూడా సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. అయితే కరోనా నేపథ్యంలో రోజా.. ఒకవైపు ఇంటికే పరిమితం కాకుండా తన నియోజకవర్గంలో ప్రజలకు అండగా నిలిబడింది. తాజాగా కరోనా నేపథ్యంలో ఏపీలో షూటింగ్స్ కోసం ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక పాలసీ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో సినీ రంగానికి సంబంధించి టాలీవుడ్‌లో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్న రోజాను ఈ కమిటీ చీఫ్‌గా నియమించబోతున్నట్టు సమాచారం. ఇదేంటి దీనికంటూ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు కదా..? మరీ రోజాకు ఆ బాధ్యతేంటి..? అనుకుంటున్నారా...అసలు కారణం ఏంటంటే.

 

అటు సినీ పరిశ్రమకి, ఇటు పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఇద్దరే. ఒకరు విజయ్ చందర్, మరొకరు రోజా. ప్రస్తుత పరిస్తితులలో సినీ రంగాన్ని ఏపీకి రప్పించడానికి ఎలాంటి పాలసీలు తీసుకోవాలి..? స్టూడియోలు కడితే ఎలాంటి రాయతీలు ఇవ్వాలి. ఇంకా చాలా చాలా విషయాలను విజయ్ చందర్ కు జగన్ అప్పగించారని తెలుస్తోంది. ఇందుకు గాను సలహాల కోసం ఓ ఐఏఎస్ ను కూడా ప్రత్యేకంగా నియమించారట. ఈ లోపు ఏపీలో షూటింగ్స్, సినిమా రిలీజ్ ల వ్యవహారం ఇవన్నీ చూసుకోవాలని రోజాకు సీఎం బాధ్యతలు అప్పగించారని తెలుస్తుంది. ఆమె కింద ఐఏఎస్ అధికారిని కూడా నియమించనున్నారు. ఎవరైనా టాలీవుడ్ దర్శక,నిర్మాతలు హీరోలు ఏపీలో ఏదైనా షూటింగ్స్ నిమిత్తం  పర్మిషన్ కావాలంటే ప్రభుత్వం తరుపున ఆమె నేతృత్వంలో ఉన్న కమిటీకి విన్నవిస్తే సరిపోతుంది. ఆమె, ఐఏఎస్ అధికారి ద్వారా  షూటింగ్స్‌కు అనుమతులు ఇచ్చేలా చేస్తోంది. మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ సినిమా షూటింగ్స్ బాధ్యతలు రోజా చేతుల్లో పెట్టడం నిజంగానే మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: