పీసీసీ పధవి పై కన్నేసిన 20 మంది కాంగ్రెస్ నేతల్లో ఆ సీటు ఎవరిని వరిస్తుంది..? కాంగ్రెస్ హై కమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది..? సోనియమ్మ అభయం ఎవరికి దక్కుతుంది..? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ అంశాలే హాట్ టాపిక్. పేరుకేమో సీటు ఒక్కటైనా ఆ సీటు పై కన్నెశారు 20 మంది కాంగ్రెస్ నేతలు.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నప్పటికీ నిత్యం ఒకరి పై ఒకరు విమర్శలు సెటైర్లు. లాక్ డౌన్ ముగియగానే కాంగ్రెస్ లో రాజకీయ సెగలు ఎగిసిపడుతున్నాయి. ఒక వైపు నుండి మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డి మరో వైపు నుండి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరి వీరికి మద్దత్తు తెలుపుతూ మరి కొందరు నేతలు.. లేదు లేదు రేసులో మేము కూడా ఉన్నమంటూ మరి కొందరు నేతలు అసలు సీటు ఎవరిని వరిస్తుంది..? రేసులో ఎవరు ముందంజలో ఉన్నారు..? కాంగ్రెస్ నేతల సపోర్ట్ ఎవరికి దక్కుతుంది..? సోనియమ్మ సీటు ఎవరికి ఇస్తుంది అని తెలియాలంటే చదవటం కొనసాగించండి.

 

పదవులు అన్నీ వదులుకొని.. తన కంఫర్ట్ జోన్ ని సైతం లెక్కచేయకుండా ప్రజలకి సేవ చేయాలని సర్కారుని ఎదురించడానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు రేవంత్ రెడ్డి. తన మాటలతో, స్పిచులతో తనకున్న చరిష్మాతో పార్టీలోకి వచ్చిన కొన్ని నెలలకే ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. నిరంతరం పార్టీకి సేవ చేస్తూ తన స్థాయిని కాంగ్రెస్ నేతల మద్దత్తుని పదవిని పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. మరో వైపు అనునిత్యం ప్రజాసేవ చేస్తూ పార్టీ నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి మొదటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వస్తున్నాడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసిన అనుభవం, తెలంగాణ ఉద్యమంలో తాను చేసిన కృషి, కాంగ్రెస్ నేతలతో తనకున్న సహవాసంతో రేసులో ఉన్న రేవంత్ కి గట్టి పోటీని ఇస్తున్నాడు. ఇక పోతే ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నే ఉత్తమం అని తన పేరుని ప్రస్తావనలోకి తీసుకొస్తున్నారు మరి కొందరు నేతలు.  

 

కానీ తాజా పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం తన మద్దత్తుని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కె ఇస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ హై కమాండ్ చేసిన స్టడీలో కోమట్టిరెడ్డికే ఎక్కువ మార్కులు వస్తున్నట్టుగా తెలుస్తుంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన ఇంటెర్వ్యూలో తనని టీపీసీసీ అధ్యక్షుడిని చేస్తే 50 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చెప్పిన మాటలు తనకి మరికొంత ప్లస్ పాయింట్ అయ్యింది..పైగా కోమటి రెడ్డి ని ఎంచుకుంటే తన గలాన్ని పార్లమెంట్ తో పాటు తన సోదరుడి రాజ్ గోపాల్ ద్వారా అసెంబ్లీ లో కూడా వినిపించగలనై చెబుతున్నాడు ప్రజలతో గడపటానికి ప్రజల కష్టాలు వినడానికి బస్సు యాత్ర చేస్తానని అంటున్నాడు. పైగా కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి జూనియర్ అని తనకి ఆ అర్హత లేదని కయ్యం చేస్తున్నారు.. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి తన గత పార్టీ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని అది పార్టీకి సారైన సంకేతం కాదని హై కమాండ్ భావిస్తుంది. పైగా రేవంత్ రెడ్డి పార్టీలు మారడం అతనికి మైనస్ పాయింట్.. ఇలా కొన్ని మైనస్ పాయింట్లు ఉండటం వల్ల రేసులో చంద్రబాబు తో రేవంత్ కి ఉన్న సంబందాల వల్లా వెనుకబడ్డాడు రేవంత్ రెడ్డి॥ ముందంజలో దుస్కుపోతున్నాడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: