కరోనా వైరస్ విషయంలో ఇంతకాలం అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలే నిజమయ్యేట్లుంది. తాజాగా డబ్ల్యూహెచ్ఓ ఉన్నతాధికారులు అసోసియేటెడ్ ప్రెస్ (ఏపి) ద్వారా ప్రకటించిన విషయాలు చూసి యావత్ ప్రపంచం విస్తుపోతోంది.  చైనా గోప్యత పాటించిన కారణంగా కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం కుదేలైపోయిన విషయం దాదాపు బయటపడినట్లే.

 

ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ తీవ్రతపై పరిశోధనలు చేస్తున్న చైనా శాస్త్రవేత్త షియోగ్లీ బృందం జనవరి 2వ తేదీనే డీకోడ్ చేసిన విషయం తాజాగా బయటపడింది. వైరస్ ను డీకోడ్ చేసిన ఆమె బృందం కరోనా ఎంత ప్రమాదకరమో వివరిస్తు అప్పుడే చైనా ప్రభుత్వానికి నివేదికను ఇచ్చిందట.  అయితే చైనా ప్రభుత్వం ఆ విషయాలను గోప్యంగా ఉంచింది. వైరస్ ప్రమాదాన్ని డీకోడ్ చేస్తే వెంటనే దానికి విరుగుడు వ్యాక్సిన్ ను కనుక్కునే అవకాశాలుండేవి. అయితే శాస్త్రవేత్తల బృందం వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కున్నది లేనిది తెలియటం లేదు.

 

ఎప్పుడైతే ప్రమాదకరమైన వైరస్ బయటపడిందో వెంటనే చైనా ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్ధతో అన్నీ విషయాలను పంచుకోవాలి. కానీ చైనా ఆ పనిచేయలేదు. వైరస్ తీవ్రతను చైనా ప్రభుత్వం జనవరి 11వ తేదీన ప్రకటించింది. చైనా ప్రభుత్వం చేసిన ప్రకటన ఆధారంగా డబ్ల్యూహెచ్ఓ కూడా మొదట్లో వైరస్ తీవ్రతను అంచనా వేయటంలో పొరబడింది. ఇక ఆ తర్వాత వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం ఎంతలా వణికిపోతోందో, ప్రపంచ దేశాలు ఎంతగా మూల్యం చెల్లించుకుంటున్నాయో అందరికీ తెలిసిందే.

 

చైనా మాటలు ముందు నమ్మిన డబ్ల్యూహెచ్ఓ కూడా తర్వాత మేల్కొని జనవరి 30వ తేదీన కరోనా వైరస్ ను ప్రపంచ విపత్తుగా ప్రకటించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొత్తం మీద శాస్త్రజ్ఞుల పరిశోధన ఫలితాలు, చైనా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని అంశాలు ప్రపంచ ఆరోగ్య సంస్ధకు చేరటంతో  డబ్ల్యూహెచ్ఓకు షాక్ కొట్టినట్లయ్యిందట. దాంతో ఇపుడు చైనా పై మండిపోతున్న డబ్ల్యూహెచ్ఓ అవే విషయాలను అసోసియేటెడ్ ప్రెస్ ద్వారా ప్రపంచం ముందుంచిందిట. దాంతో ఇపుడు ప్రపంచ దేశాలు ఏమి చేస్తాయి ? సరే ఈ విషయాలను చైనా కొట్టిపారేస్తోందనుకోండి అది వేరే సంగతి. చూద్దాం అసలు విషయం తొందరలోనే బయటపడకపోతుందా ? 

మరింత సమాచారం తెలుసుకోండి: