టీడీపీ నాయకుల పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమిని చాలిచూశాక ఆ పార్టీ అధినేతకు, ఇతర నేతలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపడింది. అయితే ఇప్పుడు 2024 ఎన్నికలనే టార్గెట్ గా పెట్టుకున్న చంద్రబాబు అందుకు అనుగుణంగా పార్టీలో సమూల మార్పులు చేర్పులు చేపట్టాలని చూస్తున్నారు. అయితే ఇప్పటికే ఆ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, కొంతమంది సీనియర్లు పక్కకు జరిగిపోయారు...అలాగే వారి బాటలో చాలామంది ఉన్నారన్నది అందరికీ తెలిసి నిజం. కానీ, పార్టీలో ఉన్న నాయకులు తమ భవిష్యత్తుపై బెంగ పెట్టుకోవడంతో చంద్రబాబు పార్టీలో కొత్త ఉత్చాహం తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మహానాడు లోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కమిటీ, ఏపీ, తెలంగాణ అధ్యక్షులు, కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలని ముందుగా భావించారు. కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా వేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ ఎంపికలను పూర్తి చేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.

 

అయితే ఇక్కడే అసలు కథ దాగుంది... అదేంటంటే.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక లాంఛనమే. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ ఉంటారు. మరి ఏపీ తెలంగాణ పార్టీ అధ్యక్షులు గా ఎవరిని నియమిస్తారు..? ఇప్పుడు ఇదే ఆ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే నిరంతరం అధికార పార్టీ పై ఉద్యమాలు, ఆందోళనలు నిర్వహించాల్సి ఉంటుందని, దానికి రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కళా వెంకట్రావు దానికి సెట్ అవ్వడని బాబు అనుకుంటున్నారు. పైగా మొన్నటి ఎన్నికల్లో కళా వెంకట్రావు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందడం కూడా ఆయనను తప్పించాలనుకోవడానికి కారణమట.

 

దీంతో ఆ పార్టీలోని సీనియర్ నాయకుల్లో ఆశ నెలకొంది. అధ్యక్ష పదవిని చేపట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో ముందు వరుసలో ఉన్న నేత ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. నిజానికి బాబు ఆలోచనలకి ఈయనే కరెక్ట్ మనిషి అని చెప్పాలి. పైగా చాలా సీనియర్, ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు కావడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వడంతో అందరూ అధ్యక్ష పదవి అచ్చెన్నకే అనుకుంటున్నారు. అలాగే అచ్చెన్న కూడా అధ్యక్ష పదవిపై బాగానే ఆశలు పెట్టున్నారట, ఇందులో భాగంగానే చంద్రబాబుని అడిగినట్టు తెలుస్తుంది. అయితే అచ్చెన్నకు పార్టీ పగ్గాలు అప్పగించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరని తెలుస్తుంది... ఎందుకంటే అచ్చెన్న ఏదో ఒక అంశం తో తరుచుగా వివాదాల్లో ఉండడమే కాకుండా, అధికార పార్టీ పై మరీ దూకుడుగా వ్యవరిస్తుంటారు, ఇక పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ఆయన మరింతగా చెలరేగిపోయే అవకాశం ఉంటుందని భావించిన చంద్రబాబు అచ్చెన్నకు నో చెప్పాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: