రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పడుతున్న బాధల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విధానాలు పార్టీకి ప్రధాన ఇబ్బంది కాగా చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలు పార్టీ కార్యకర్తలను కూడా ఆవేదనకు గురి చేస్తున్నాయని చెప్పవచ్చు. కొంత మంది సీనియర్ నేతలు యువనేతలకు నియోజకవర్గాల్లో చుక్కలు చూపిస్తున్నారు. గత పదేళ్ళు గా పార్టీ కోసం కష్టపడిన చాలా మంది యువనేతలు ఇప్పుడు నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడింది. సీనియర్ నేతలు కార్యకర్తలను పిలవడం వారితో మాట్లాడటం, వారిని యువనేతలకు దూరంగా ఉండాలి అని చెప్పడం, కోవర్ట్ లు గా ముద్ర వేయడం వాళ్ళు వచ్చి చంద్రబాబుకి ఫిర్యాదులు చేయడం, చంద్రబాబు వాటిని నమ్మి వారిని పక్కన పెట్టడం వంటి పరిణామాలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్నాయి. 

 

ఓ వైపు చంద్రబాబు తన కుమారుడు లోకేష్ ను ముందు పెట్టుకుని రాజకీయం చేస్తూ పార్టీలో యువతకు ప్రాధాన్యం కల్పిస్తానని మాటలు చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీలో ఇప్పటికీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వృద్ద నేత‌ల మాటే నడుస్తోందని విమర్శలు సొంత పార్టీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. యువ నేతలు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా వృద్ధ నేతల మాత్రం వారి మాటలను ఎక్కడా ప్ర‌యార్టీ లేకుండా చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ కోసం తాము ఎంత కష్టపడినా సరే విలువ ఉండటం లేదని చాలా మంది యువనేతలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

పార్టీలో యువ‌నేతలు ఎవ‌రైనా వాయిస్ వినిపించి వాళ్లు ముందుకు వెళితే... వాళ్లు లోకేష్ ను ఎక్క‌డ డామినేట్ చేస్తారో ? అన్న సందేహం బాబుకు ఉంద‌ని కొంద‌రు అంటున్నారు. ఇక యువ‌నేతలు అయితే తాము పార్టీలో ఏ విషయాన్ని కూడా స్వేచ్చగా బయటకు చెప్పలేని పరిస్థితి వచ్చింది అని తాము ఇదే కొనసాగితే మాత్రం పార్టీ మారతామని స్పష్టం చెప్తున్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలుసుకోలేని చంద్రబాబు ఈ పరిణామాలను నమ్మడం కూడా ఇప్పుడు విడ్డూరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: