ఇప్పుడు కేంద్రం రాష్ట్రాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాష్ట్రాలకు కేంద్రం అండగా నిలబడలేదు అంటే పరిస్థితి కాస్త ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇప్పుడు పరిపుష్టిగా లేదు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక ఆర్ధిక లోటు ఉన్న ఈశాన్య రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ బాగా ఇబ్బంది పడుతున్నాయి. అసలే ఆర్థిక లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్లో రాబడి ఆగిపోవడంతో ఆదాయం లేక‌పోవ‌డంతో పాటు విభజన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవడం... కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దీన‌ స్థితికి చేరుకుంది.

 

20 కోట్ల మంది జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, దేశ ఆర్ధిక రాజధానిగా ఉన్న ముంబై కూడా ఇబ్బంది పడే పరిస్థితి అనేది వచ్చింది. కేంద్రం రాష్ట్రాల‌కు మాటలు చెపుతూ కాల‌క్షేపం చేస్తోంది. అంకెల గారడీతో మాయ‌లు చేస్తోంది అన్న‌ది నిజం. క‌రోనా నేప‌థ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ ప్రెస్ మీట్లు పెట్టి కోట్ల‌కు కోట్లు ఇస్తామ‌ని చెప్పినా అవి ఎలా ? ఇస్తారో ? ఆ విధివిధానాలేంటో తెలియ‌దు. కేంద్రం ఎప్ప‌ట‌కీ చెప్పేలా లేదు. అందుకే ఇప్పుడు కేంద్రం పై పోరాటానికి రెండు తెలుగు రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. తమకు అన్యాయం జరుగుతుంది అని కేసీఆర్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. 

 

ఇప్పుడు జగన్ తో కలిసి కేంద్రం మీద దూకుడుగా వెళ్ళాలి అనేది కేసీఆర్ భావనగా ఇప్పుడు పరిశీలకులు చెప్తున్నారు. రాష్ట్రాల్లో ఇదే విధానం కొనసాగితే మాత్రం పరిస్థితులు అంచనా వేయడానికి కూడా  ఉండవు అని, అందుకే ఇద్దరు కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రితో, ప్రధానితో కూడా భేటీ కావాలి అని భావిస్తున్నట్టు సమాచారం. కనీస అవసరాలకు కూడా రాష్ట్ర‌ ప్రభుత్వాల వద్ద నిధులు లేవు... అందుకే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలను పెంచాలి అని లేదా రుణాలకు వడ్డీలు లేకుండా చూడాల‌ని కేసీఆర్ జ‌గ‌న్‌తో కలిసి కేంద్రాన్ని కోర‌తార‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: