ఒక్కసారి v/s మరొక్కసారి మధ్య జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల పోటీలో అనూహ్య విజయం సాధించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తున్నారు. ఈ ఏడాది పరిపాలనలో జగన్ జనం మెచ్చిన నాయకుడు గా తనను తాను నిరూపించుకున్నారు. అసలు ప్రజాపాలన ఏ విధంగా ఉంటుందో ప్రజలకు చేసి చూపించాడు. పార్టీలకు అతీతంగా అందరినీ సమాన దృష్టితో చూస్తూ, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందే విధంగా సరికొత్త రీతిలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా సరే ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, రాష్ట్రానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేశంలోనే డైనమిక్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా, ఆయన చేసే పనికి ఎందరు అడ్డు పడుతున్నా సరే అవేం పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.

 

అయితే సీఎం జగన్ పై ఆయన సొంత పార్టీ నేతలె అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. కొందరు ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్తున్నారు. అసలు వీళ్ళ అసంతృప్తికి కారణం ఏంటంటే...సీఎం జగన్ తన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను సైతం సరిగా పట్టించుకోవడం లేదని, కనీసం కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదనే బాధలో వారు ఉన్నారట. మొత్తం పరిపాలన అంతా అధికారుల ద్వారానే చేస్తూ తమను సరిగా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

అలాగే రాష్ట్రం తీసుకుంటున్న చాలా నిర్ణయాలను కోర్టు తప్పుపడుతుందని, పార్టీలో రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారని, వారి అనుభవాలను, వారి సలహాలను తీసుకుని జగన్ ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు రావని సూచిస్తున్నారు. అలా కాకుండా ఏకపక్షంగా ముందుకు వెళ్తే ఎదురుదెబ్బలు తప్పవని వారు జగన్ కి సూచిస్తున్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా ఈ వ్యవహారంలో మారకుంటే ప్రభుత్వంలో ఏర్పడిన చిన్న చిన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని టీడీపీ రాజకీయాలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రజల్లో ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ, కొన్ని విషయాల్లో సీనియర్ల సలహాలు తీసుకొని...అందరినీ కలుపుకొని సీఎం జగన్ ముందుకు వెళ్తే పార్టీకి ఇంకొంచం బలం చేకూరుతుందని చెప్పవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: