2019 ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన చంద్రబాబుకి అప్పటి నుండి కంటి మీద కునుకు లేదనే చెప్పాలి. ఆయన హయాంలో జరిగిన అవినీతిపై అధికారపక్షం ఆరా తీయడం, రాజకీయ విమర్శలు చేయడం ఇలా ఎన్ని చేసిన చంద్రబాబు ఏదోకటి చేసి పార్టీని నెట్టుకొస్తున్నారు. అయినా అధికార, ప్రతిపక్షాల మధ్య ఇలాంటివి సర్వ సాధారణం. అయితే ఈసారి చంద్రబాబుకి సొంత పార్టీ నేతలే తలనొప్పిగా మారారట. టీడీపీ తరుపున గెలిచి, ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా సీఎం జగన్ కి దగ్గరగా ఉంటూ చంద్రబాబుపై సొంత ఎమ్మెల్యేలే విమర్శలు చేయడం ఒకపక్క. పార్టీలోనే ఉంటూ తరుచూ గొడవలు పడే నాయకులు మరోపక్క.

 

ముఖ్యంగా ఆళ్లగడ్డలో జరుగుతున్న రాజకీయం ఇప్పుడు అధినేత చంద్రబాబు నాయుడుకి ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అందులోనూ మాజీ మంత్రి అఖిల ప్రియ వ్యవహారశైలి చంద్రబాబుకి తీవ్ర ఇబ్బందిగా మారింది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజకీయంగా బలంగా ఉండాల్సిన సమయంలో ఇలా రోడ్డు మీదకు వచ్చి విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు ఆందోళన వ్యక్తం చేయడం తెలుగుదేశానికి చికాకుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి పార్టీ నేతల మధ్య ఏమైనా వివాధాలు తలెత్తితే చంద్రబాబు పరిష్కరిస్తారు. నేతలు దూకుడుగా మాట్లాడిన సరే, ఆయన మాత్రం చాలా వరకు సానుకూలంగా వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆళ్లగడ్డలో జరుగుతున్న రాజకీయ రచ్చపై మాత్ర౦ అలా ఎక్కడా కూడా జరగడం లేదు అని చెప్పవచ్చు. పైగా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

 

అయినా కూడా చంద్రబాబు నుంచి మాత్రం స్పందన అనేది రావడం లేదు. పైగా వాళ్ళ ఇద్దరిలో ఎవరు పార్టీకి రాజీనామా చేసినా సరే ఆయన బుజ్జగించే అవకాశం కూడా లేదు అని అంటున్నారు. అయితే పార్టీ పరువు బజారున వేస్తున్న నాయకుల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాలి కొందరు నేతలు బాబుకి సూచిస్తున్నప్పటికి ఆయన మాత్రం వీళ్ళని లైట్ తీసుకున్నారని తెలుస్తుంది. చంద్రబాబు గనుక వీళ్ళ విషయంలో మౌనం విడకపోతే దీని ప్రభావం జిల్లాలోని వేరే నాయకుల మీద కూడా పడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: