ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో చిక్కులు పెరుగుతున్నాయి. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త విభే దాలు కొన‌సాగుతున్నాయి. కొన్ని చోట్ల సైలెంట్‌గా ఉంటే.. మ‌రికొన్ని చోట్ల హ‌త్యాప్ర‌య‌త్నాల వ‌ర‌కు కూ డా దారితీస్తున్నాయి. తాజాగా క‌ర్నూలు జిల్లాలో ఏవీ సుబ్బారెడ్డి ని హ‌త్య చేసేందుకు మాజీ మంత్రి, భూ మా అఖిల ప్రియ భ‌ర్త భార్గ‌వ‌రామ్ రూ.50 ల‌క్ష‌ల సుపారీ ఇచ్చిన‌ట్టు పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. టీడీపీలో వ్య‌క్తిగ‌త క‌క్ష‌లు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధ‌మ‌వుతున్నాయి. గ‌డిచిన రెండు నెల‌ల కింద‌టే పోలీసులు ఈ కేసును రిజిస్ట‌ర్ చేశారు.

 

అప్ప‌ట్లోనే నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. ఇక‌, దీనిపై స్పందించిన మాజీ మంత్రి అఖిల ప్రియ‌.. దీని వె నుక రాష్ట్ర అధికార పార్టీ లేద‌ని క్లీన్ చిట్ ఇచ్చారు. ఒక‌వేళ అధికార వైసీపీ ఉంద‌ని అంటే..మరింత‌గా ఇ బ్బందిక‌ర ప‌రిస్థితి ఉంటుంద‌ని ఆమె భావించారో.. లేక.. చంద్ర‌బాబు ఎలాగూ.. త‌మ‌ను వ‌దిలేశారు కాబ ‌ట్టి.. ఇక‌, వైసీపీతో రాజీ ఫార్ములాను ఏర్పాటు చేసుకోవ‌డం బెస్ట్ అనుకున్నారో తెలియ‌దు. అదేస‌మయం లో ఏవీ సుబ్బారెడ్డి కూడా దీనిపై స్పందిస్తూ.. తాను పార్టీకి మూడు నెల‌లుగా దూరంగా ఉన్నాన‌ని చెప్పుకొచ్చారు. ఈ రెండు ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు జిల్లాలోని సీనియ‌ర్ల‌కు ఫోన్ చేశారు.

 

ప‌రిస్థితిని తెలుసుకున్నారు. అటు అఖిల‌ప్రియ‌కు, ఇటు సుబ్బారెడ్డికి మ‌ధ్య గ‌తంలో అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే చంద్ర‌బాబు అనేక సార్లు.. పంచాయ‌తీ చేశారు. ఇక‌, ఇప్పుడు మ‌రీ హ‌త్యాయ‌త్నాల వ‌ర‌కు ప‌రిస్థితి దారితీసింది. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు జోక్యం చేసుకున్నా.. ఫ‌లితం ఉంటుందా? ఉండ‌దా? అనేది ఆస‌క్తిగా మారింది. ఇక్క‌టికే ఇరువురు నేత‌లు పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు. జిల్లా లో సీనియ‌ర్లు చెప్పినా కూడా వినే ప‌రిస్థితిలో లేరు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు మౌనంగా ఉండ‌డ‌మే మేల‌ని జిల్లాకుచెందిన నాయ‌కులు చెబుతున్నారు. కాద‌ని జోక్యం చేసుకున్నా.. ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారి పార్టీకి హాని జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: