ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ఎందుకటే..గతకొన్ని రోజులుగా మీడియా వర్గాల్లో వైసీపీకి చెందిన ఒక వార్త తెగ హల్ చల్ చేస్తుంది. అదేమిటంటే… వైసీపీకి సీఎం జగన్ కొత్త అధ్యక్షుడిని నియమించాలని అనుకుంటున్నారని. ఏపీ ప్రజలు ఇచ్చిన బలమైన తీర్పుతో రాజకీయంగా ఎంతో బలంగా ఉన్న అధికార పార్టీ ఇప్పుడు భవిష్యత్తు మీద దృష్టి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. పార్టీకి ఏ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారనే అనుకోవాలి. పార్టీలో కొద్ది కొద్దిగా బయటపడుతున్న అంతర్గత విభేదాలు ఏమీ లేకుండా చూడటంతో పాటుగా కొన్ని కీలక నిర్ణయాలు దిశగా జగన్ అడుగులు వేస్తున్నారట.

 

ఇందులో భాగంగానే పార్టీకి అధ్యక్షుడుని నియమించే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయంపై రోజుకో రకం కథనం, రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తుంది. నిన్న మొన్నటివరకూ ఈ బాధ్యతలు సజ్జల రామకృష్ణారెడ్డి కి ఇస్తున్నారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఇప్పుడు మరో పేరు తెరపైకి వస్తుందట. ఆయన ఒక యువ నాయకుడని, పైగా ఎంపీ అని పార్టీ వర్గాల నుంచి హింట్స్ వస్తున్నాయి. ఈ విషయంలో భవిష్యత్తుని కూడా దృష్టిలో ఉంచుకుని యువ నేతకు బాధ్యతలు అప్పగించాలి అని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడిగా రాయలసీమకు చెందిన ఒక యువ ఎంపీని నియమించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆ యువ ఎంపీకి జగన్ కి మంచి సంబంధాలు ఉన్నాయట. దీనిపై ఇప్పటికే పార్టీ అగ్ర నేతలతో జగన్ చర్చలు కూడా జరిపారు అని తెలుస్తుంది. పార్టీకి కొత్త కమిటీలు కూడా వేసే ఆలోచనలో జగన్ ఉన్నారని సమాచారం. క్షేత్ర స్థాయిలో పార్టీని వచ్చే ఎన్నికలకి సమాయత్తం చేయాలంటే కమిటీలు కీలకం అని ఆయన భావిస్తున్నారు. యువనేతలు, సీనియర్లతో పార్టీలో కొత్త కమిటీల దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు అని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: