వైసిపిలో ధిక్కార స్వరాలంటూ కొద్ది రోజులుగా పిచ్చిరాతలు రాస్తున్న ఎల్లోమీడియాకు చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా లేచిన గొంతులను బయటకు వినబడనీయకుండా నానా అవస్తలు పడింది. అప్పట్లో టిడిపి నేతలే ఎన్నేసి మాటలన్నారో, ఆరోపణలు గుప్పించారో ఎల్లోమీడియా మరచిపోయినట్లుంది. మంత్రివర్గంలో చోటు దక్కలేదన్న కోపంతో సీనియర్ నేతలు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు ఎంతగా మండిపడ్డారో అందరికీ తెలిసిందే.  తర్వాత వివాదాస్పద ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ కూడా చాలా గట్టిగానే మాట్లాడాడు. కరణం బలరామ్ లాంటి వాళ్ళు చంద్రబాబు మీద ఎంత మాట్లాడినా వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎల్లోమీడియా కవర్ చేసేసింది.

 

మంత్రివర్గంలో చోటు దక్కకపోవటంతో మండిపోయిన బోండా మాట్లాడుతూ ’చంద్రబాబు నమ్మించి కాపుల గొంతు కోశాడు’  అంటూ చేసిన వ్యాఖ్యలను ఏమంటారో ?  బోండా చేసిన వ్యాఖ్యలు పార్టీలో అప్పట్లో తీవ్ర సంచలనం రేపాయి. తర్వాత బుచ్చయ్య మాట్లాడుతూ పచ్చి అవకాశవాదులకు, డబ్బు సంచులు మోసేవారికే చంద్రబాబు మంత్రిపదవుల్లో చోటు కల్పించినట్లు చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.  ఓ వ్యూహం ప్రకారం ఎన్టీయార్ అభిమానులను చంద్రబాబు పార్టీకి దూరంగా నెట్టేస్తున్నాడని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి.

 

టిడిపిలో తాను ఉండలేనని ఎన్టీయార్ పేరుతో తొందరలోనే కొత్త పార్టీ పెడతానంటూ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఓ రేంజిలో సెగలు రేపాయి.  వైసిపి తరపున గెలిచిన గొట్టిపాటి రవికుమార్ ను టిడిపిలో చేర్చుకున్నపుడు సీనియర్ నేత కరణం బలరామ్ చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తుండే ఉంటుంది. రవిలాంటి పోటుగాడు టిడిపిలో లేరా అంటూ చంద్రబాబునే నిలదీశాడు. తమ మనోభావలకు విరుద్ధంగా గొట్టిపాటిని చేర్చుకుంటున్న విషయమై మండిపడిన కరణం సమయం వచ్చినపుడు తానేంటో చూపిస్తానంటూ చంద్రబాబుకే వార్నింగులిచ్చాడు.

 

ఇక రెవిన్యు మంత్రిగా పనిచేసిన కేఇ కృష్ణమూర్తి అసంతృప్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  ఒక్క రెవిన్యు ఇన్ స్పెక్టర్ ను కూడా బదిలీ చేసే అధికారం తనకు లేదని మాజీ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అసంతృప్తిని బయటపెట్టాడో లెక్కేలేదు.  ఇక అయ్యన్నపాత్రుడు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు.   విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో అప్పటి సహచర మంత్రి గంటా శ్రీనివాసే కీలక పాత్రదారంటూ పెద్ద బాంబే పేల్చాడు. అంతేకాకుండా గంటా కబ్జాలపై సిట్ విచారణ ముందు హాజరైన అయ్యన్న గంటాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను  కూడా అందించాడు.

 

వివిధ సందర్భాల్లో అప్పట్లో చంద్రబాబు మీద సీనియర్ నేతలు చేసిన కామెంట్లను వదిలిపెట్టేసి ఇపుడు ప్రజాసమస్యలపై మాట్లాడుతున్న వైసిపి ఎంఎల్ఏల్లో అసంతృప్తంటూ నానా గోల చేస్తోంది. ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నదే అసంతృప్తి అయితే మరి ఏకంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసిన కామెంట్లు, ఆరోపణలను ఏమంటారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: