సోషల్ మీడియా..ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు మొదలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రస్తుత కాలంలో. చేతిలో ఒక మంచి ఫోను, సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఉంటే ఏదైనా పోస్ట్ చేయవచ్చు అనే ధోరణిలో ఉన్నారు కొందరు మూర్ఖులు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కొందరు చేసే అసత్యప్రచారాల కారణంగా సెలబ్రిటీలు తమ మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇప్పటికే ఇలా ఫేక్ న్యూస్ లు ప్రచారం చేసే చాలా మందిని పోలీసులు అరెస్టు చేసి తమదైన శైలిలో బుద్ధి చెప్తున్నారు. అయినా సరే ఇలా చేసే వారిలో మార్పు రావట్లేదు. అయితే తాజాగా ఈ ఫేక్ న్యూస్ బారిన తెలంగాణ సీఎం కేసీఆర్ పడ్డట్టు తెలుస్తుంది. దీంతో ఆగ్రహం చెందిన కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఓ ఫేస్ బుక్ యూజర్ పై స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అసలు ఆ ఫేక్ న్యూస్ ఏంటి..? అది పెట్టిన ప్రబుద్ధుడు ఎవడు..? ఇలాంటివి తెలియాలంటే పూర్తిగా చదవాల్సిందే...

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ కారణంగా చనిపోయారంటూ పణ్యాల రాజు అనే వ్యక్తి తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. కరోనా వైరస్ సోకి కేసీఆర్ మరణించారని.. ముక్కు ద్వారా కరోనా వైరస్ లోపలికి వెళ్లిందని.. ఆయన చనిపోయారంటూ గాంధీ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారంటూ పోస్టు పెట్టాడు. దీంతో ఈ పోస్టు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. కొందరు ఇది తప్పుడు వార్త అని గమనించగా.. మరి కొందరు మాత్రం ఫోటోషాప్ చేసిన ఫోటోను చూసి నిజంగానే కేసీఆర్ చనిపోయారేమోనని నమ్మారు. అయితే వెంటనే కొందరు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చారు. ఇలాంటి పోస్టుల ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, ప్రజల సెంటిమెంట్లతో కూడా ఆడుకుంటున్నారంటూ బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు కేసు రిజిస్టర్ చేశారు. దీంతో పణ్యాల రాజు అనే వ్యక్తి ఫేస్ బుక్ ఐడీపై పోలీసులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఐపీ అడ్రెస్ ద్వారా సదరు వ్యక్తిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: