కొన్ని ద‌శాబ్దాలుగా తెలుగు రాజ‌కీయ‌, ఆర్థిక‌, వ్యాపార‌, వైద్య‌, విద్యా రంగాల‌ను శాసిస్తూ వ‌స్తోన్న క‌మ్మ సామాజిక వ‌ర్గం క్ర‌మ‌క్ర‌మంగా త‌మ ఆధిప‌త్యాన్ని, ప్రాభావాన్ని కోల్పోతుంది. ఇక సినిమా రంగంలోనూ అదే జ‌రుగుతోంది. వాస్త‌వంగా చూస్తే  సమాజం మార‌డం... పెరిగిపోతోన్న పోటీ.. మిగిలిన కులాల‌కు చెందిన వారు కూడా అన్ని రంగాల్లో దూసుకు వ‌చ్చి ఉన్న‌త స్థానాల‌కు వెళ్ల‌డం కూడా ఇంద‌కు ప్ర‌ధాన కార‌ణం. ఇక రాజ‌కీయంగా తెలంగాణ‌లో తెలుగుదేశం భూస్తాపితం కావ‌డంతో అక్క‌డ ఉన్న క‌మ్మ వ‌ర్గం అంతా కేసీఆర్ చెంత‌కు చేరిపోయింది. ఇక తెలంగాణ రాజ‌కీయాల్లో క‌మ్మ వ‌ర్గం ప్ర‌భావం పూర్తిగా నామ‌మాత్ర‌మైంది. మ‌హా అయితే ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా వ‌ర‌కు మాత్ర‌మే వీరి మాట నెగ్గ‌వ‌చ్చు.

 

ఇక ఏపీలో కమ్మ‌ల‌దే ఆధిప‌త్యం కాదు.. ఇక‌పై అలా జ‌రిగే ఛాన్స్ కూడా లేదు. కోస్తా జిల్లాల్లో క‌మ్మ‌ల‌ను మించేలా కాపులు ఉన్నారు. వీరు కూడా రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం కాచుకుని కూర్చొని ఉన్నారు. ఇక రెడ్డి సామాజిక వ‌ర్గం ఇప్పుడు ఏక‌తాటిమీద‌కు వ‌చ్చి మ‌రీ జ‌గ‌న్‌ను స‌పోర్ట్ చేస్తోంది. రాజ‌కీయంగా టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ఆ పార్టీకి స‌పోర్ట్ చేసిన కులాలు అన్ని ఆ పార్టీకి దూరం కావ‌డంతో తెలుగుదేశంతో పాటు ఆ పార్టీని న‌మ్మ‌కుని ఉన్న క‌మ్మ‌ల‌లో తీవ్ర‌మైన ఆందోళ‌న‌, గుబులు చెల‌రేగింది. ఇక తెలుగుదేశంలో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని డిసైడ్ అయిన వారంతా ఇప్ప‌టికే జ‌గ‌న్ చెంత‌కు చేరిపోతున్నారు.

 

పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు వ‌ల్ల‌భ‌నేని వంశీ, క‌ర‌ణం బ‌ల‌రాం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. ఇక ఆ పార్టీ నుంచి గెలిచిన ఇద్ద‌రు క‌మ్మ ఎంపీల‌లో జ‌య‌దేవ్‌, కేశినేని నాని ఇద్ద‌రూ కూడా బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఒక్క‌టి మాత్రం నిజం. చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ జీవితం ఇక దాదాపు ముగిసిన‌ట్టే అని స్ప‌ష్టం అవుతోంది. ఈ విష‌యంపై టీడీపీలో రాజ‌కీయం చేసే పెద్ద క‌మ్మ‌ల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్పుడు పార్టీ బ‌త‌కాలి... తాను అధికారంలోకి రావాల‌ని భావిస్తోన్న చంద్ర‌బాబు మోడీని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ప‌డ‌ని పాట్లు లేవు. ఇక చిన్న క‌మ్మలు.. రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని అనుకున్న వాళ్లు వైసీపీలోకి వెళ్లిపోతున్నారు.

 

ఇక వైసీపీలోకి వెళ్ల‌లేని వాళ్లు... అక్క‌డ అవ‌కాశాలు లేని వాళ్లు... టీడీపీలోనే ఉండే క‌మ్మ‌లు మాత్రం లోకేష్ ఎప్పుడు పార్టీ నుంచి త‌ప్పుకుంటాడు ?  త‌మ చివ‌రి అస్త్రం అయిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఈ పార్టీ ప‌గ్గాలు చేప‌డ‌తాడు ?  లేదా ?  ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడ‌తాడా ?  అని ఆలోచ‌న‌లు, ఊహ‌ల్లో మునిగిపోవ‌డం మిన‌హా చేసేదేం లేద‌ని స‌రిపెట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: