తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తన కుటుంబాన్ని తన దరిదాపుల్లోకి ఏనాడు రానివ్వలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తనయులు ఏనాడు కూడా తండ్రి పేరు చెప్పుకొని ఒక్క రూపాయి ఆశించ‌లేదు.. చిన్న ప‌ని కూడా చేయించుకోలేదు... అన్న ప్రశంసలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన బాలయ్య ఆ తర్వాత రాజకీయాల్లోకి సైతం వ‌చ్చి హిందూపురం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ క్రమంలోనే బాలయ్య సిఫార్సుల‌ తో తెలుగుదేశం పార్టీలో కొంతమందికి ప‌ద‌వులు వ‌చ్చాయ‌న్న ప్ర‌చారం ఉంది.

 

ఇక బాల‌య్య చెప్ప‌డంతోనే కొంద‌రికి ఎమ్మెల్యే సీటు రావడం.. వారు ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగాయి. ఈ లిస్టులో చాలా మంది ఉన్నా ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మాత్రం బాలయ్యకు చిన్ననాటి స్నేహితుడు ఆయన ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు తో పాటు విశాఖపట్నం జిల్లా విశాఖ నగర తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఉంటారు. వెలగపూడి రామకృష్ణబాబుకు బాల‌య్య చెప్ప‌డంతోనే 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సీటు వచ్చిందని చెబుతారు. ప్రజారాజ్యం పార్టీ ఆ ఎన్నిక‌ల్లో ఉన్నా కూడా ట్ర‌యాంగిల్ ఫైట్‌లో విజయం సాధించిన వెలగపూడి ఆ తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు.

 

ఇక బాల‌య్య‌కు చిన్న‌నాటి స్నేహితుడు అయిన క‌దిరి బాబూరావుకు 2009 ఎన్నికల్లో కనిగిరి సీటు ఇచ్చారు. అయితే నామినేషన్ లో తప్పులు దొర్లడంతో కదిరి నామినేషన్ తిరస్కరణకు గురైంది. తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ బాల‌య్యే ఆయ‌న‌కు ప‌ట్టుబ‌ట్టి మ‌రీ మ‌రోసారి క‌నిగిరి సీటు ఇప్పించారు. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా వీళ్ళిద్దరూ బాలయ్య సిఫార్సుల‌తోనే సీట్లు ద‌క్కించుకుని ఎమ్మెల్యేలు ఆయన వారు కావడం విశేషం. ఇక కొన్ని నామినేటెడ్ పదవులను సైతం బాల‌య్య సిఫార్సుల‌తోనే కొంద‌రికి చంద్రబాబు కేటాయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: