నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజాకు ఎట్టకేలకు పూర్తి రాజకీయం ఒంటబట్టినట్టు తెలుస్తుంది. రాజకీయాలు చేయడం సినిమాలో చూపించినంత తేలిక కాదు అని, నిజ జీవితంలో రాజకీయాలు చేయాలంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలని ఆమెకు ఇప్పటికి అర్ధం అయింది. అందుకే తన ప్రత్యర్ధుల వ్యూహాలకు చెక్ పెడుతూ..వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ.. వారికి తనలోని కొత్త రాజకీయ నటిని పరిచయం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రోజా ఈ సారి చెక్ పెట్టబోతుంది ప్రతిపక్ష నేతలకు కాదట, సొంత పార్టీలోని నేతలకేనట. అసలు మ్యాటర్ ఏంటంటే...

 

2019 లో భారీ విజయాన్ని కైవసం చేసుకొని అధికారం చేపట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అయితే ఆయన తొలి మంత్రి వర్గంలో ఎమ్మెల్యే రోజాకు స్థానం దక్కుతుందని అందరూ అనుకున్నారు.. ఆమెతో సహా. కానీ, కుల సమీకరణాల్లో లెక్కల తేడాల వల్ల అది సాధ్యపడలేదు. దాంతో అసంతృప్తి చెందిన రోజాకి ఏపీఐఐసీ చైర్మన్ పదవినిచ్చి బుజ్జగించారు సీఎం జగన్. అయినప్పటికీ ఆమెకు మంత్రి పదవిపై ఆశ పోలేదు. అయితే తాజాగా ఇప్పుడు ఇద్దరు మంత్రులైన పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపీదేవి వెంకటరమణలను సీఎం జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. దీంతో వారి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అలాగే ఇదే సమయంలో మంత్రివర్గంలో పనితీరు సరిగ్గా లేని మరి కొందరిని జగన్ మారుస్తున్నట్టు చర్చ జరుగుతోంది. దీంతో సహజంగానే మంత్రి పదవి కోసం వేచి చూస్తున్న ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు.

 

ఈ విషయంలో రోజా కాస్త ముందంజలో ఉందని సమాచారం. సీఎం జగన్ కూడా ఆమెపట్ల సానుకూలంగానే ఉన్నారని తెలుస్తుంది. అయితే రోజా గనుక మంత్రివర్గంలోకి వస్తే తమ హవాకు గండి పడుతు౦దని భావిస్తున్న రాయలసీమకు చెందిన ఇద్దరు మంత్రులు ఆమెకు మంత్రి పదవి రాకుండ అడ్డుకుంటున్నారని తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన రోజా, ఆ మంత్రులపై ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది. ఇప్పటికే వారి లోటుపాట్లు, ఇతరత్రా వ్యవహారాల మీద రోజా సమాచారం సేకరించినట్టు తెలుస్తుంది. అవసరమైతే వీటన్నింటిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి, కుదిరితే వారి మంత్రి పదవులు పీకించైనా సరే తన మంత్రి పదవికి లైన్ క్లియర్ చేసుకోవాలన్నది రోజా ఎత్తుగడగా కనిపిస్తోంది. మరి ఈ ఎత్తుగడల్లో ఎవరు నిలుస్తారు..?  అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: