- తొలి సారి ఘాటైన వ్యాఖ్య‌లు

- ఎంపీ సాయిరెడ్డి కామెంట్ల‌పై కౌంట‌ర్

- ట్విట‌ర్ వేదిక గా యువ ఎంపీ ఫైర్

- టీడీపీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి

వాద ప్ర‌తివాద‌న‌లు రేగుతున్న వైనం

- అధినేత చెప్ప‌నిదే ఏమీ న‌మ్మ‌వ‌ద్దు

- యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు క్లారిఫికేష‌న్

 

కోపానికి తావే లేదు
వివాదాల జోలికి పోయిందే లేదు
ఎన్న‌డూ సౌమ్య‌త‌కూ నిబ‌ద్ధ‌త‌కూ
నిలువెత్తు చిరునామా ఈ సిక్కోలు రాముడు
ఉన్నంత‌లో త‌న‌కు చేత‌న‌యినంత‌లో
అంద‌రికీ చేరువ‌లో ఉంటూ సాయం అందిస్తూ
రాష్ట్ర , దేశ రాజ‌కీయాల‌లో దూసుకుపోతున్న యువ ఎంపీకి
ప‌ద‌వుల కాంక్ష లేదు..ఆయ‌నో పార్టీకి కార్యక‌ర్త మాత్ర‌మే అన్న‌ది
తరుచూ ఆయ‌న అభిమానుల మాట..అయినా ఈ ప‌త్రిక‌లు ఆయ‌న‌ను గొడ‌వ‌ల్లోకి లాగుతున్నాయి.. వివాదాల‌కు అతీతుడిగా ఉన్న ఆయ‌న‌ను వివాద‌స్ప‌దుడిగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. తాజాగా ఈ గొడ‌వ‌కు ఆజ్యం పోస్తూ వైసీపీ ఎంపీ సాయి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్య‌లు దుమారానికి కార‌ణం అయ్యాయి.


నాన్నంత‌టి నాన్న ఎవ్వ‌ర‌యినా ఉన్నారంటే అది అధినేతే..ఈ మాటే ఎన్నో సార్లు చెప్పారు యువ ఎంపీ. నాన్నంత‌టి నాన్న ఎవ్వర‌యినా త‌న‌కు దారి చూపారంటే అది బాబాయే.ఆయ‌న ఏం చెబితే అదే..ఇదే మాట ఎన్నో సార్లు వెల్ల‌డించారాయ‌న‌. కానీ ఈ రోజు ఆయ‌నకు తెలుగు దేశం రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నార‌న్న వార్త‌లు వెల్ల‌డ‌వుతున్న నేప‌థ్యంలో మళ్లీ ఇ దే అంశం తెర‌పైకి వ‌చ్చి క‌ల్లోలితాల‌కు కార‌ణం అవుతోంది. వైఎస్సార్సీపీ ఎంపీ విజ‌య్ సాయి రెడ్డి ఇదే అంశంపై తీవ్ర ధోర‌ణిలో తె లుగుదేశం అధినేత‌పై వ్యాఖ్య‌లు చేశారు."కొడుకేమో ‘తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు’. సీనియర్లంతా చేతులెత్తేశారు. ఎవరై తే ఏంటని 32 ఏళ్ల రామ్మోహన్ కు ముళ్ల కిరీటం తగిలిస్తున్నాడు బాబు గారు.

 

రాజధాని కాకుండా విశాఖను అడ్డుకోజూసి నవ్వు ల పాలయ్యాడు. ఉత్తరాంధ్ర ప్రజలను బుజ్జగించాలని అమాయకుడిని బలి పీఠం ఎక్కిస్తున్నాడు..." అంటూ టీడీపీ అధినాయక త్వం పై మాటల యుద్ధానికి సిద్ధం అయ్యారు. అధినాయ‌క‌త్వం ఏం చెప్ప‌కుండానే ప‌త్రిక‌ల్లో ఏదో ఒక క‌థ‌నం వ‌స్తుండ‌డం, ఇదే అ దునుగా సాయి రెడ్డి వ్యాఖ్య‌లు చేయ‌డంతో యువ ఎంపి త‌న స‌హ‌జ సిద్ధ ధోర‌ణికి భిన్నంగాస్పందించారు. ఎన్న‌డూ లేనిది త‌న ఆగ్ర‌హావేశాల‌ను వెల్ల‌డించారు. అదే ట్విట‌ర్ వేదిక‌పై త‌న‌దైన పంథాకు భిన్నంగా మాట్లాడుతూ..కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.


ఏ ప్రాంతానికీ ఒరిగిందేమీ లేదు.. : యువ ఎంపీ
"అల్లుడేమో అవినీతికి తిమ్మరాజు పనికి పోతురాజు.సీనియర్లు అందరూ చేతగానోడి పాలన చూసి ''ఛీ'' కొడుతున్నారు.కారు దిం చేశారనే కక్షతో మామ అప్రూవర్ గా మారి అల్లుడిని కుర్చీ నుండి దించేయాలని కుట్ర మొదలెట్టాడు.ప్రత్యేక హోదా పై చేతులెత్తే శారు.ఉత్తరాంధ్ర రైల్వే జోన్ పట్టాలెక్కించడం చేతకాలేదు..." అంటూ ఫైర్ అయ్యారు. ఇంకా త‌న మాట‌లు కొన‌సాగిస్తూ..మూడు ముక్కలాట మొదలెట్టి మూతిముడుచుకొని కూర్చోవడం తప్ప ఏడాదిలో మామ,అల్లుడి వలన ఏ ప్రాంతానికి ఒరిగింది ఏమి లే దు.ఢిల్లీలో కాళ్లు మొక్కడం,ట్విట్టర్ లో రెచ్చిపోవడం మాని రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్ లో కృషి చేస్తే ప్రజలు హ ర్షిస్తారు..అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.. త‌న స్వ‌భావానికి విరుద్ధంగా ఈ సారి యువ ఎంపి చేసిన ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ రం గాన తీవ్ర ప్ర‌కంప‌న‌ల‌కు దారి తీస్తున్నాయి.

 

ముఖ్యంగా తాము ఏనాడు సొంత ఎజెండాలతో ప‌నిచేసింది లేద‌ని, త‌మ‌కూ, త‌మ కు టుంబానికీ వేరే ఎజెండాలు ఏమీ లేవ‌ని ప‌దే ప‌దే తాను చెబుతున్నా ప‌త్రిక‌లు ఏవేవో రాసుకుంటూ పోతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య ‌క్తం చేస్తూ వ‌స్తున్నారు యువ ఎంపీ. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌య‌మై తాను వివ‌ర‌ణ ఇస్తున్నా ఇదేమీ ప‌ట్టించుకోకుండా ఎవ‌రికి న ‌చ్చింది వారు రాసుకుని త‌న‌కు త‌న కుటుంబానికి లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నార‌ని మ‌థ‌న‌ప‌డుతున్నారు. త‌మ‌కు అధినేత మాట‌లే శిరోధార్యం అని ప‌దే ప‌దే చెబుతున్నా చెవికెక్కించుకోని కొంద‌రు ఇలా మాట్లాడుతుండ‌డం స‌బ‌బు కాద‌ని హిత ‌వు చెప్పారు.


అధినేత చెప్ప‌కుండా క‌థ‌నాలా?
వ‌దంతి వ‌ద్దు వాస్త‌వాలు న‌మ్మండి
"అధినేత చంద్ర‌బాబు నాయుడు వెల్ల‌డి చేయ‌కుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వికి తన‌ను ఎంపిక చేశారంటూ, త్వ‌ర‌లో పద‌వీ ప‌గ్గాలు అందుకోబోతున్నానంటూ కొంద‌రు (కొన్ని మీడియాలు) అదే ప‌నిగా ప్ర‌చారం చేస్తున్నాయి. క‌థ‌నాలు వండి వారు స్తున్నాయి. ఇవ‌న్నీ నా దృష్టికి వ‌చ్చాయి. ఇవాళ పార్టీ ఏ ప‌ద‌వి అప్ప‌గించినా లేదా అప్ప‌గించకున్నా ఓ సామాన్య కార్య‌క‌ర్త‌గానే ను నా విధులు నిర్వ‌ర్తించేందుకు ఎన్న‌డూ సుముఖంగానే ఉంటాను. మా అధినేత నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రాకుండా, క‌నీసం మాకు సంప్ర‌తించ‌కుండా ఎలా ఆ క‌థ‌నాలు వెల్ల‌డి చేస్తారు..ఇది పూర్తిగా అనైతికం అనే భావిస్తున్నా..ఇలాంటి గంద‌ర గోళ క‌థ నా లు రాయ‌డం త‌గ‌దు. మా వ‌ర‌కూ అధినేత చంద్ర‌బాబు ఏం చెబితే అదే అంతిమ వాక్కు.. ఇందులో మారో మాట‌కు తావులేదు.. ప‌త్రిక‌ల్లో కానీ సామాజిక మాధ్య‌మాల్లో కానీ అనైతిక వార్త‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం ఎంత‌మాత్రం బాధ్య‌త‌గ‌ల పౌరులకు త‌గదు. మంచి ప‌నుల‌కు యువ‌త త‌మ స‌మ‌యం కేటాయించాలి..అదేవిధంగా మీడియా సంబంధిత వ్య‌క్తుల ధ్రువీక‌ర‌ణ లేకుండా వార్త లు రాయ‌డం త‌గ‌దు.

 

ఇటువంటి ప్ర‌తిపాద‌న‌లు గ‌తంలోనూ వ‌చ్చాయి..నేను దీన్నొక హైపోథిటిక‌ల్ వెర్ష‌న్ గానే చూస్తున్నా అని చె ప్పాను. ఇప్ప‌టికీ ఇదే మాట. నా వ‌ర‌కూ పార్టీకి విధేయుడిగా ఉంటూ, పార్టీ అప్ప‌గించే ప్ర‌తి ప‌నినీ బాధ్య‌తాయుతంగా నిర్వర్తించ డం అన్న‌దే నా త‌క్ష‌ణ క‌ర్త‌వ్యం..."అంటూ ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. కానీ ఈ రోజు విజ‌య్ సాయి రెడ్డి అదే ప‌నిగా అటు టీడీపీ అధినేతనూ ఇటు లోకేశ్ నూ టార్గెట్ చేస్తూనే, వివాదంలోకి యువ ఎంపీని తీసుకురావ‌డంతో వెనువెంట ‌నే రామ్మోహ‌న్ నాయుడు ప్ర‌తిస్పందించి తాను చెప్పాల‌న‌కున్న మాటలు కాస్త క‌టువుగా ఉన్నా స‌రే, ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు తానేంటో చెప్ప‌క‌నే చెప్పారు. ఇప్పుడీ వివాదంపై అటు వైసీపీ అధినాయ‌క‌త్వం కానీ ఇటు టీడీపీ అధినాయ‌క‌త్వం కానీ ఏ విధంగా స్పంది స్తుందో అన్న‌ది కీల‌కం.


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

మరింత సమాచారం తెలుసుకోండి: