ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడటం అనేది సాధ్యం అయ్యే పని కాదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ పార్టీలో ఉంటే త‌మ జీవితం అయిపోయిన‌ట్టే అని చాలా మంది నేత‌లు ఇప్ప‌టికే డిసైడ్ అయ్యారు. పార్టీ పెట్టిన‌ప్ప‌టి నుంచి ఉన్న 
నేతలు, కీలక నేతలు అందరూ కూడా ఇప్పుడు పార్టీ మారడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా కూడా బలంగా ఉండటం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా అవసరం కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆ పార్టీకి అనుకూలించడం లేదు. 

 

చంద్రబాబు కొందరు నేతలను పక్కన పెట్టడం తో పార్టీలో బలమైన నేతలు అనే వాళ్ళు ఎవరూ కూడా ఎక్కడా కూడా కనపడటం లేదు అనే చెప్పాలి. చిన్న చిన్న నేతలకు, పార్టీ మారి వచ్చిన వాళ్లకు  అన్ని విధాలుగా సహకరించిన ఆయన ఇప్పుడు పార్టీకి అవసరమైన వాళ్ళను మాత్రం బాగా ఇబ్బంది పెడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ప‌దేళ్ల పాటు పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎంతో మంది పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే చంద్ర‌బాబు మాత్రం పార్టీ అధికారంలోకి వ‌చ్చాక వీరిని ప‌క్క‌న పెట్టి.. ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన అమ‌ర్నాథ్ రెడ్డి, అఖిల‌ప్రియ‌, సుజ‌య్ కృష్ణ రంగారావు, ఆదినారాయ‌ణ రెడ్డి లాంటి వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.

 

 ఇక ఇప్పుడు గల్లా జయదేవ్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌ల్లా గుంటూరు నుంచి వ‌రుస‌గా రెండు సార్లు టీడీపీ త‌ర‌పున ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయ‌న పార్టీలో ఎంత మాత్రం ఇమిడే ప‌రిస్థితిలో లేర‌ని టాక్‌..? ఇక  కృష్ణా జిల్లాతో పాటుగా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. వారిలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉండే ఒక నేత కూడా ఉన్నారు అని తెలుస్తుంది. ఇప్పటికే వారిని బుజ్జగించడానికి గానూ చంద్రబాబు రంగంలోకి దిగినా సరే ఫలితం మాత్రం ఉండటం లేదు అని సమాచారం. మరి ఎవరు పార్టీ మారతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: