బై బై బాబూ.. 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షాలు.. ఎన్నికల్లో ప్రజలు.. ఇప్పుడు సొంత పార్టీలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అంటున్న మాట. దీంతో చంద్రబాబు అయోమయంలో పడ్డారు. పార్టీకి ఎలాగైనా పూర్వ వైభవం తీసుకురావాలని, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే అధినేత చంద్రబాబుకు ఒక ఆలోచన వచ్చిందంట. అదేంటంటే.. బీజేపీ నాయకురాలైన దగ్గుబాటి పురంధేశ్వరిని ఎలాగైనా టీడీపీలోకి తీసుకురావాలి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

 

ఈ విషయంలో బాబు.. పురంధేశ్వరి ఇంటికి వెళ్లి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ముందు నిలబడి పార్టీలోకి ఆహ్వానించలేని పరిస్థితి. కాబట్టి ఈ బాధ్యతలను కొడుకు లోకేష్ కు అప్పజెప్పారట. దీంతో దగ్గుబాటి దంపతులను టీడీపీ పార్టీలోకి రావాలని లోకేష్ అడగబోతున్నట్టు సమాచారం. అది జరగడం పెద్ద విషయమేమీ కాదు.. ఎందుకంటే రాజకీయ అవసరాలకోసం పవన్ ఇంటికే వెళ్లిన బాబుకు.. సొంత వదిన ఇంటికి తన కొడుకుని పంపి అడిగించడం చాలా చిన్న విషయమే కానీ… ఆ అహ్వానాన్ని పురంధేశ్వరి మన్నిస్తారా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. అయితే ఈ వ్యవహారం లో లోకేష్ కి తోడుగా బాలకృష్ణ కూడా ఉండనున్నారట. వాస్తవానికి టీడీపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో నందమూరి కుటుంబం మద్దతు చాలా అవసరం, ఇదే సమయంలో దగ్గుబాటి కుటుంబానికి రాజకీయంగా గట్టి మద్దతు అవసరం. కాబట్టి ఈ విషయంపై దగ్గుబాటి ఫ్యామిలీ ఖచ్చితంగా ఆలోచిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా బాలకృష్ణ కూడా సీన్ లో ఉండటంతో పురంధేశ్వరి ఖచ్చితంగా ఇందుకు ఒప్పుకుంటారని టీడీపీ శ్రేణుల మాట.

 

ఒకవేళ ఇదే జరిగి పురంధేశ్వరి ఒప్పుకుంటే మాత్రం బాబు కొత్త ప్లాన్ వర్కవుట్ అవ్వడం స్టార్ట్ అయినట్లే. అలాగే ప్రస్తుతం వైసీపీలో అసమ్మతి నేతల గళం బాగా వినిపిస్తుంది. దీంతో చంద్రబాబు వారిపై కూడా ఫోకస్ పెట్టారని తెలుస్తుంది. ఆ నేతలను కలిసి వారిని టీడీపీలో చేర్చుకునే ఎత్తుగడను చంద్రబాబు అమలు చేయబోతున్నారని తెలుస్తుంది. అయినా పార్టీ ఎంత సంక్షోభంలో కూరుకుపోయినా దాన్ని ఎలా కాపాడుకోవాలో 40 ఏళ్ల అనుభవం ఉన్న బాబుకి తెలీదా చెప్పండి. ఇది చూస్తే అర్ధమైపోవాలి చంద్రబాబుని రాజకీయ చాణక్యుడు అని ఎందుకు అంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి: