- ప్ర‌జాస్వామ్య రీతికి అప‌హాస్యం
- బాబాయ్ కు మ‌ద్ద‌తుగా అబ్బాయ్
- అచ్చెన్న అరెస్టు పై స్పందించిన యువ ఎంపీ
- బీసీ నేత‌ల‌ను గౌర‌వించే తీరు ఇదేనా!
- బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష‌నేతను ఎదుర్కోలేకే ఇలా చేశారా?

 

ఓ వైపు క‌క్ష సాధింపులు..మ‌రో వైపు ట్విట‌ర్ వేదిక‌గా మాటల యుద్ధాలు అ మ‌లుచేస్తూ..ప్ర‌క‌టిస్తూ..అధికార పార్టీ విప‌క్షాన్ని పూర్తిగా టార్గెట్ చేస్తూ..త‌న పంతం నెగ్గించుకునే ధోర‌ణిలో పోతున్న తరుణాన ఈ తొల‌క‌రి వేళ‌లో రాష్ట్ర రాజ ‌కీయాలు మ‌రో మారు వేడెక్కాయి. ఈ ఉద‌యం (శుక్ర‌వారం ఉద‌యం) అచ్చె న్న అరెస్టుతో మ‌ళ్లీ కొన్ని కీల‌క నిర్ణ‌యాల‌పై నాటి ప్ర‌భుత్వం చేప‌ట్టిన పనుల ‌పై జ‌గ‌న్ స‌ర్కార్ పునః స‌మీక్ష‌కు పూనుకోవ‌డంతో పాటు, ఇంకొంద‌రి అరెస్టు ల‌కు సైతం సిద్ధం అయ్యేందుకు ప‌క్కా ప్లాన్ లో ఉం ద‌ని తెలుస్తోంది. ఈ నేప‌ థ్యంలో అందిస్తున్న క‌థ‌నం ఇది.

 

శ్రీ‌కాకుళం న‌గ‌రం : కార్మిక శాఖ మాజీ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడి అరె స్టు రాజ‌కీయ రంగాన ప‌లు ప్ర‌కంప‌నలకు తావిస్తోం ది. గ‌తంలో విప‌క్షంలో ఉ న్న‌ప్పుడూ కింజ‌రాపు కుటుంబం త‌మ‌దైన పంథాలో నాటి అధికార పార్టీపై పో రాడింది. నాడు ఎర్ర‌న్న హయాంలో అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్సార్ వెలువరిం చిన కీల‌క నిర్ణ‌యాల‌పై తిరుగులేని పోరాటం సాగించింది. మ‌ళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యేందుకు అవ‌కాశాలు మెండుగా ఉన్న ఈ త‌రుణాన త‌మ బాబాయ్ ను అ రెస్టు చేసిన తీరు ఏమంత ఆమోద యోగ్యంగా లేద‌ని, ఆయ‌న‌ను అరెస్టు చే సింది పోలీసులా లేదా వైసీపీ గుండాలా అంటూ యువ ఎంపీ తీవ్ర భావోద్వేగా నికి లోనయ్యారు. 

 

ఆత్మ గౌర‌వ‌మే త‌మ అజెండా అని, తాను త‌ప్పులు చేస్తే, అధికారికంగా నిర్ణ‌యాల అమ‌లులో నియ‌మాల‌కు తిలోద కాలు ఇస్తే రికార్డు లు అన్నీ మీ ద‌గ్గ‌రే ఉన్నాయ‌ని, మీరు ఏ విచార‌ణ‌కు పిలిచినా తాను సిద్ధ‌మే న‌ని గ‌తంలో బాబాయ్ చెప్పార‌ని, కానీ ఇవేవీ ప‌ట్ట‌క ఏక‌ప‌క్ష ధోర‌ణిలో వైఎస్సా ర్సీపీ క‌క్ష పూరిత ధోర‌ణిలో అరెస్టుల‌కు పాల్ప‌డ‌డం త‌గ‌ద‌ని అన్నారు.

 

వార్ స్టార్ట్స్ నౌ : "ఢీ కొన‌లేకే ఇదంతా.."
బీసీ నేత‌ల‌కు గౌర‌వించే తీరు ఇది కాదు.. ఆయ‌న‌ను ఢీకొన లేకే మీరంతా ఇలా అరెస్టుల‌తో వేధింపుల‌కు గురిచేసేందుకు సిద్ధం అ వుతున్నారంటూ.. యువ ఎంపీ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ శాస‌న స‌భా ప‌క్ష ఉప‌నేత (డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్), సీనియ ర్ నాయ‌కులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు అరెస్టుపై యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు సామాజిక మాధ్య‌మాల కేంద్రంగా స్పం దించారు. అరెస్టు చేసిన తీరు ప్ర‌జాస్వామ్య రీతికి విరుద్ధంగా ఉందంటూ.. గ‌ళ‌మెత్తారు.ఈ సంద‌ర్భంగా ఆయ‌నేమన్నారంటే..‌"అ సెంబ్లీలో అధికార‌ప‌క్షాన్ని నిల‌దీసే నిలువెత్తు ప్ర‌జల ధైర్యం మా బాబాయ్ అచ్చెన్నాయుడు. 

 

ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో బాధ్య‌తా యుత‌మైన ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించ‌డమే మా బాబాయ్ చేసిన త‌ప్పా? అణి‌చివేత‌కు గురైన బీసీ వ‌ర్గాల గొంతుక‌గా త‌న గ‌ళాన్ని వి నిపిస్తున్న అచ్చెన్న‌ని స‌భ‌లో ఎదుర్కొనే స‌త్తా మీ 151 ఎమ్మెల్యేల‌కూ లేదా? టీడీఎల్పీ ఉప‌నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రిని అరె స్టు చే సేట‌ప్పుడు క‌నీస చ‌ట్ట‌బ‌ద్ధంగా వ్య‌హ‌రించ‌డ‌మైనా చేత‌కాదా? బీసీ నేత‌ల‌కిచ్చే గౌర‌వం ఇదేనా? అస‌లు అచ్చెన్నాయుడిని అరెస్టు చేసింది? ఏసీబీనా? ‌లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాలా?" అంటూ యువ ఎంపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: