వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఏడాది పాలన అద్భుతం. మంచి అనుభవం ఉన్న పాలకుడిలా ఏడాది పాలన చేశారు. ఎక్కడా కూడా అవినీతి మచ్చ కనబడకుండా జాగ్రత్త పడ్డారు. టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా పని గట్టుకుని ఎన్ని విమర్శలు చేసినా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో  ఎంత సమర్ధవంతంగా పని చేశారో, సీఎం అయ్యాక ప్రజా సమస్యల పరిష్కారంలో అంతే సమర్ధంగా పని చేస్తున్నారు. వైఎస్‌ జగన్ సంక్షేమ పథకాలు గడప గడపకు వెళ్తున్నాయి.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల మాట.

 

వైఎస్‌ జగన్‌  ఏడాది పాలనపై సోషల్ మీడియా ప్రశంసలు కురిపించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు కర్ణాటక, తమిళనాడుల్లోని వైఎస్‌ జగన్‌ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించారు. వైఎస్‌ జగన్ లాంటి పాలకుడు తమకు లేకపోవడం దురదృష్టకరమంటూ పోస్ట్‌లు పెట్టారు. తమిళనాడు, కర్ణాటకల్లో వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి  సంబరాలు చేసుకున్నారు అభిమానులు. సోషల్ మీడియాలోనైతే వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూనే చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు మహిళలు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో చేయనది వైఎస్‌ జగన్‌ ఏడాది కాలంలో చేసి చూపించి  విశ్వసించదగ్గ నాయకుడు అనిపించుకున్నాడని మహిళలు  చెప్పారు. ఇంటి దగ్గరకే పింఛన్లు, వాలంటీర్‌ వ్యవస్థ జగన్‌ ప్రజారంజక పాలనకు నిదర్శనాలు. చంద్రబాబు పాలనలో పింఛన్‌ ఇవ్వడానికి పదో తారీఖు వరకు తిప్పుకున్న రోజులున్నాయి.  వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ఫస్ట్ తారీఖునే , తెల్లవారక ముందే పింఛన్లు ఇంటి గడప తొక్కుతున్నాయి. దీంతో వృద్ధులు  వైఎస్‌ జగన్‌ పాలనను అభినందిస్తున్నారు.

 

రివర్స్‌ టెండరింగ్‌తో  వేల కోట్ల ప్రజాధనాన్ని సీఎం జగన్‌ ఆదా చేశారు. అమ్మ ఒడితో చిన్నారుల చదువులకు అండగా నిలిచారు. గోరు ముద్ద పథకంతో మామయ్య విద్యార్ధుల ఆకలి తీర్చారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రెండో విడత పది వేల రూపాయలు ఇచ్చి మాట ఇస్తే తప్పనని జగన్‌ నిరూపించుకున్నారు.  ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించడమే కాకుండా, వేల కోట్ల రూపాయల ఫీజులు చెల్లించారు. మీరు ఏం చదువుకుంటారో చదువుకోండి నేను చదివిస్తానని విధ్యార్ధులకు ధైర్యానిచ్చారు. వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని చెప్పి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలిచారు. ఏపీలోనే  కాదు సౌత్ ఇండియాలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చంటూ ప్రకటించారు.

 

 పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయి. అక్టోబర్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్  జలాలు పొలాల్లో గలగలపారనున్నాయి. ఓ నాయకుడిగా కాకుండా ఓ సేవకుడిగా వైఎస్‌ జగన్‌ ప్రజారంజక పాలన సాగిస్తున్నారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా వినిపిస్తున్న మాట. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇంతలా అభివృద్ధి చేయలేదని. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఒక్క సంవత్సరంలోనే ఇంతలా చేశాడని, అసలైన నాయకుడికి, అవకాశవాదికి ఇదే తేడా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: