తెలంగాణాలో జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో ఒక ఓటును కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తు పట్టుబడ్డాడు. పర్యవసానం ఏమిటయ్యా అంటే పదేళ్ళ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వదిలేసి విజయవాడకు పారిపోయాడు. అధికారంలో ఉన్నపుడు అడ్డుగోలు అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం అరెస్టయ్యాడు. చంద్రబాబు దొరికిపోయిన ’ఓటుకునోటు’ నుండి బయటపడేందుకు యావత్ రాష్ట్ర ప్రజలను భాగస్వాములను చేయాలని చూశాడు. ఓటుకునోటులో దిరికిపోయేసరికి పెద్ద గొడవైంది. దాంతో ’ ఏం తమ్ముళ్ళు మనకు హైదరాబాద్ లో ఉండే హక్కు లేదా ’ అంటూ తాను చేసిన పనికిమాలిన మాటలు మాట్లాడాడు.

 

తాజాగా అచ్చెన్నను ఏసిబి అధికారులు అవినీతి ఆరోపణలపై అరెస్టు చేస్తే బిసిలపై దాడిగా అభివర్ణిస్తున్నాడు. అచ్చెన్న అరెస్టుకు బిసి సామాజికవర్గానికి ముడేసే ప్రయత్నం చేస్తున్నాడు. బిసిలను రెచ్చగొట్టేందుకు ఉదయం నుండి రాత్రి వరకూ ప్రయత్నం చేస్తునే ఉన్నాడు.  ఇక్కడ అర్ధంకాని విషయం ఏమిటంటే ఓటుకునోటు కేసులో పట్టుబడే ముందు చంద్రబాబు ఏమన్నా తాను తెలంగాణాలో ఓ నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటు కొంటానని ఏపి జనాలకు చెప్పాడా ?

 

లేకపోతే తెలంగాణా నామినేటెడ్ ఎంఎల్ఏ ఓటును రూ. 5 కోట్లకు బేరం చేయమని ఏపి జనాలే చంద్రబాబుకు చెప్పారా ? రెండింటిలో ఏదీ జరగలేదు. తానే సొంతంగా పనికిమాలిన పని చేద్దామని అనుకుని అడ్డంగా దొరికిపోయేటప్పటికి తాను తప్పించుకోవటానికి ఏపిలో జనాలందరినీ రొంపిలోకి దించే ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిందే.  

 

ఇక అచ్చెన్న విషయం చూస్తే ఈ మాజీ మంత్రిని ఎవరు కూడా బిసి సామాజికవర్గానికి హోల్ అండ్ సోల్ ప్రతినిధిగానో లేకపోతే రక్షకుడిగానో చూడలేదు. అచ్చెన్న ఎంతసేపు బిసి కార్డును ఎంఎల్ఏ టిక్కెట్టు తెచ్చుకునేందుకు, మంత్రివర్గంలో చోటు దక్కించుకునేందుకే ఉపయోగించుకున్నారు. మంత్రి అయిన తర్వాత వందల కోట్ల రూపాయల కుంభకోణంలో ఇరుక్కోమని బిసి సామాజికవర్గం అచ్చెన్నకు చెప్పిందా ? అసలు బిసిల ప్రయోజనాల కోసం అచ్చెన్న చేసిన కృషి ఏమిటో ఎవరికీ  తెలీదు.

 

వాస్తవానికి బిసిల్లోనే అచ్చెన్నంటే పెద్ద సదభిప్రాయం ఉన్నట్లు లేదు.  ఎందుకంటే అవినీతి ఆరోపణల్లో అరెస్టయిన అచ్చెన్నే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని బిసి సంఘాలే  స్పష్టం చేశాయి. అచ్చెన్న అరెస్టుకు బిసి సామాజికవర్గానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చేశాయి.  బిసి సామాజికవర్గం ప్రయోజనాల కోసం పోరాటం చేస్తు అచ్చెన్న అరెస్టు కాలేదు కాబట్టి తమకేమీ సంబంధం లేదని బిసి సంఘాల నేతలంటున్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలతో చంద్రబాబు రాజకీయం ఎంత చీపుగా ఉందో అందరికీ అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: