చంద్రబాబు నయా స్ట్రాటజీ.. పార్టీలోకి కొత్త శక్తి..? జరగబోయేది అదేనా..?నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చస్తుంది అన్నట్టు. ఎంతటి పెద్ద రాజకీయ చాణక్యుడైనా ఏదోకసారి బొక్కబోర్లా పడాల్సిందే. అచ్చం ఇదే టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో జరిగింది. దేశ రాజకీయాలనే శాసించిన వాడిని నేను అని చెప్పుకునే బాబు 2019 ఎన్నికల్లో ఎలా ఒడిపోయారో అందరం చూశాం. దీంతో గుణపాఠం తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు తన నాయకత్వ పటిమకు మళ్లీ పదును పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలుస్తుంది. అందుకే ఆయన ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నారట...

 

2014 ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన చంద్రబాబ, రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఆర్థిక లోటులో ఉన్న ఏపీని గాడిన పట్టే పనికే ప్రాధాన్యమిచ్చారు. అంతేకాకుండా రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన చంద్రబాబు. టీడీపీ పటిష్టతపై అంతగా దృష్టి సారించలేకపోయారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసి జగన్ కు గట్టి షాకే ఇచ్చారు. అయితే ఈ చర్య మున్ముందు తన పార్టీని దెబ్బేస్తుందని చంద్రబాబు గ్రహించలేకపోయారు.

 

అయితే 2019 లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బకు దెబ్బ అన్నట్టు బాబునే అనుసరించారు. దీంతో చంద్రబాబు ఒక కొత్త ఆలోచనలో పడ్డారు. రానున్న రోజుల్లో తమ పార్టీకి ఇలాంటి ముప్పు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దానిపై ఆయన కసరత్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే వ్యాపార బలహీనత లేని నాయకత్వం అవసరతను బాబు గుర్తించారు.

 

ప్రస్తుతం పార్టీ వీడిన కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, మద్దాలి గిరి.. తాజాగా మాజీ మంత్రి శిద్ధా రాఘవరావులు వ్యాపార బలహీనతతోనే పార్టీ మారారన్న విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. ఇక పార్టీలో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న నాయకత్వానికి ఆ బలహీనత ఉండరాదన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో వ్యాపార బలహీనత లేని కొత్త నాయకత్వాన్ని రూపొందించే పనిలో పడ్డారు చంద్రబాబు. ఒకవేళ బాబు కసరత్తు గనుక ముగిస్తే,  టీడీపీ తిరుగులేని శక్తిగా మారుతుందని రాజకీయ వర్గాల్లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: