ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీ నేతల్లో భయం మొదలయింది. ఎప్పుడు ఎవరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనేది ఇప్పుడు ఆ పార్టీ నేతలకు స్పష్టత రావడం లేదు. ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వ పాల‌న‌లో జ‌రిగిన‌న్ని అక్ర‌మాలు అన్నీ ఇన్నీ కావు. కొంద‌రు అడ్డ‌గోలుగా దోచేసుకుంటే మ‌రి కొంద‌రు పెద‌బాబు చంద్ర‌బాబు, చిన‌బాబు లోకేష్ ఒత్తిడి మేర‌కు చేసిన త‌ప్పుల‌తో ఇప్పుడు వాళ్లు మాన‌సిక క్షోభ అనుభ‌విస్తున్నారు. ఇక ఏపీలో టీడీపీ నాయ‌కుల వ‌రుస అరెస్టుల‌తో టీడీపీ నేత‌ల‌కు కంటి మీద కునుకు ప‌ట్ట‌డం లేదు. 

 

ఇక మాజీ మంత్రి అచ్చెన్నాయుడు నిన్న అరెస్టు కాగా... ఈ రోజు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆయ‌న త‌న‌యుడు అస్మిత్ రెడ్డి అరెస్టు కావ‌డంతో టీడీపీ నేత‌ల్లో ఒక్క‌సారిగా అల‌జ‌డి రేగింది. ఇద్దరు మాజీ మంత్రులు ఒక మాజీ ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్ళారు అని వార్తలు వస్తున్నాయి. వారిలో అగ్ర నేతలు కూడా కొందరు ఉన్నారు అని అంటున్నారు. ఇక చంద్రబాబు ప్ర‌భుత్వంలో ఉన్న కీలక అధికారులుకూడా భయపడుతున్నారు. వ‌రుస ఎటాక్‌ల‌కు భ‌య‌ప‌డి ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్ళిపోయారు అని సమాచారం. 

 

ఈ స్కాం లో ఏసీబీ చాలా వరకు దూకుడుగా ఉంది. ఎవరి పేర్లు అయిన సరే బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వాళ్ళు అందరూ ఇప్పుడు చంద్రబాబు ఫోన్ చేస్తున్నా సరే స్పందించే పరిస్థితి కనపడట౦ లేదు అని అంటున్నాయి రాజకీయ వర్గాలు. చూడాలి ఇక చంద్రబాబు పాత్ర కూడా ఇందులో ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా మంది నుంచి ఎక్కువగా వినపడుతున్న వ్యాఖ్య. ఆయన అందుకే ఇప్పుడు కంగారు  పడుతూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. మ‌రో నాలుగైదు రోజుల్లో ఇద్ద‌రు మాజీ మంత్రులు, వారి వార‌సుల గుట్టు కూడా మొత్తం ర‌ట్టుకానుంద‌ని స‌మాచారం. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఏసీబీ దూకుడు మాత్రం టీడీపీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: