చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందా..? టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా అరెస్టు అవుతుండటంతో రాష్ట్ర రాజకీయం వేడిగా మారింది. ఆ పార్టీకి చెందిన నేతల్లో కలవరం మొదలైంది. అధినేత చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇవన్నీ కక్షపూరితంగానే చేస్తున్నారని ధ్వజమెత్తారు.

 

కాకపోతే ఇక్కడ చంద్రబాబు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. ఇదంతా ఆయన నేర్పిన విద్యయే.. ఇవి అక్రమ అరెస్టులైతే చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో జరిగిన అరెస్టులు ఏంటీ..? ఆనాడు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్థులను, యువకులను అక్రమంగా అరెస్టు చేయించింది ఎవరు..? ఆనాడు ఆ అమాయక విద్యార్థులపైన, యువకులపైన అక్రమ కేసులు పెట్చిందెవరూ..? ఇలా రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సమస్యపైనైనా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసినా అమాయకులను అక్రమ అరెస్టులకు పాల్పడటం, అక్రమ కేసులు బనాయించడం‌ జరిగేవి. కొన్ని సందర్భాలలో అయితే ఏకంగా జైలుకు పంపించారు. వీటికి చంద్రబాబు కారకుడు కాదా..?

 

అలాగే టీడీపీ ప్రభుత్వం హయాంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని అరెస్ట్ చేసిన విధానం. అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ముద్రగడని చేశారు అంటే రాజకీయ గొడవ అనుకోవచ్చు,కాని ఆయన భార్య కుమారుడు కొడళ్లను కూడా ఈ విధంగా చేశారు. వీటికి కారణం చంద్రబాబు కాదా..?అలాగే గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాని శాసనసభలో అడుగుపెట్టకుండా చేసింది ఎవరు..? ఆమెపై మాటల యుద్ధానికి, నోటికొచ్చినట్టు మాట్లాడి, ఆమెను సస్పెన్షన్ విధించారు. దీనిపై రాష్ట్రంలో పెద్ద దుమారమే చెలరేగింది. మరి దీనికి కారణం చంద్రబాబు కాదా..?

 

ఆనాడు అమాయకులను అరెస్టులు చేయించడం, కేసులు బనాయించడం, జైల్ కు పంపించడం చేసిన చంద్రబాబు...ఈ రోజు అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే దాన్ని అక్రమ అరెస్టులని అనడం నిజంగా హాస్యాస్పదం.

మరింత సమాచారం తెలుసుకోండి: