అచ్చెన్నాయుడి అరెస్టుతో టీడీపీ నాయకుల్లో భయం మొదలైందా..? అంటే అవుననే చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే రాష్ట్ర రాజకీయంలో ఏదో పెను మార్పు చోటుచేసుకోబోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నయి. ఆ ఊహాగనాలకు తగ్గట్టే కొంత మంది నాయకులు అడుగులేస్తున్నట్టు సమాచారం. రోజుల వ్యవదిలో ముగ్గురు టీడీపీ నేతలను అరెస్టు చేయడంతో ఆ పార్టీలోని ఇతరు నేతల్లో కలవరం మొదలైంది. దీంతో కొంత మంది సీఎం జగన్ కి సరెండర్ అయ్యేందుకు సిద్దమయ్యారని తెలుస్తుంది.

 

వ్యాపారాల దృష్ట్యా, మరి కొన్ని ఇతరతర కారణాల దృష్ట్యా కొంత మంది నేతలు చంద్రబాబు కి హ్యాండ్ ఇవ్వబోతున్నారట. ఇప్పటికే టీడీపీకి చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ఇంతకుముందే వీడిన నేతలు చెప్తున్న మాట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరికొంత మంది వారి బాట పట్టానున్నారని తెలుస్తుంది. వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు గొట్టిపాటి రవి కుమార్ ది.

 

ఈయన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరారు. కానీ, 2014 ఎన్నిక తర్వాత కొన్ని సమస్యల వల్ల టీడీపీకి లోబడి ఆ పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటంతో యాతన తిరిగి వచ్చేస్తాడని అందరూ భావించారు. కానీ, ఆయన మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అహనుహ్య పరిణామాలతో ఆయన కూడా పార్టీ మరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

 

ఈ నేపధ్యంలోనే వైసీపీ ముఖ్య నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. కానీ, రాజీనామా చేస్తే తప్ప తమ పార్టీలోకి వేరేవారిని తీసుకోమని గెలిచిన వెంటనే సీఎం జగన్ షరత్తు పెట్టారు. దీంతో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీని వీడి, వైసీపీలో చేరనప్పటికీ  జగన్ కు మద్దతు గా ఉంటున్నారు. ఇప్పుడు గొట్టిపాటి రవి కుమార్ కూడా వాళ్ళ లిస్టులో చెరనున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఇలా పార్టీని వీడి చంద్రబాబుకి షాక్ ఇవ్వడానికి చాలామంది నేతలు సిద్ధంగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: