ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రచ్చ నడుస్తుంది. రోజుల వ్యవధిలో టీడీపీ నేతలను ముగ్గురిని అరెస్టు చేయడంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. కొందరు బీజేపీ నేతలు సైతం అధికార పార్టీ చర్యను సమర్ధిస్తున్నారు. అలాగే జనసేన పార్టీ కి చెందిన ఓ కీలక నాయుడు సైతం టీడీపీ నేతల అరెస్టుపై స్పందిస్తూ..

 

అధికార పార్టీ చర్యను తాము స్వాగతిస్తున్నామని, ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా అని చెప్పారు. అలాగే సోషల్ మీడియాలోనూ జనసేన పార్టీ నాయకులు టీడీపీని ఉద్దేశించి మరింతగా కామెంట్లు చేయడం వంటి పరిణామాలు కలకలం రేపాయి. ఈ వ్యవహారంపై అప్రమత్తమైన టీడీపీ నష్ట నివారణ చర్యలు దిగినట్టు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి జనసేన వైఖరిపై ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.ప్రస్తుతం వరుస వరుసగా టీడీపీ నాయకులను వైసీపీ టార్గెట్ చేస్తుంది, వేధింపులకు పాల్పడలని చూస్తోందని, ఈ సమయంలో మీ పార్టీ తరఫున సానుభూతి చూపించకపోగా, విమర్శలు చేయడం తగదని, దీని కారణంగా అధికార పార్టీకి మరింత బలం చేకూరుతుందని చంద్రబాబు పవన్ కు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన మెత్తబడినట్లు తెలుస్తోంది.

 

ఈ మేరకు జనసేన తరుపున పార్టీ నాయకులు ఎవరు టీడీపీ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడవద్దు అంటూ ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఉదయం వరకు టీడీపీ పైన , అచ్చెన్న అరెస్టు పైన విమర్శలు చేస్తూ వచ్చిన జనసేన నాయకులు అకస్మాత్తుగా అరెస్ట్ అక్రమం అంటూ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ వేధింపులు ఆపాలంటూ డిమాండ్ కూడా మొదలుపెట్టారు. ఇది గ్రహించిన వైసీపీ శ్రేణులు జనసెనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీజేపీ కలిసి నడుస్తూ.. చంద్రబాబు మాటలు వినడానికి సిగ్గులేదా అంటూ నిలదీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: