అవ‌కాశం దొరికిన ప్ర‌తీసారి...అవ‌కాశం క‌ల్పించుకుని అనేక‌సార్లు సినీరంగానికి చెందిన వారిపై త‌న కొత్త ప‌లుకు వ్యాసంలో విరుచుకుప‌డుతుంటారు ఆంధ్ర‌జ్యోతి మేనేజింగ్ డైరెక్ట‌ర్ వేమూరి రాధాకృష్ణ‌. లాక్‌డౌన్ నుంచి సినిమా షూటింగ్‌ల‌కు అనుమ‌తులు కావాల‌ని సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన కొంత‌మంది అగ్ర‌హీరోలు, నిర్మాత‌లు తెలుగు రాష్ట్రాల సీఎంల‌ను క‌లిసి విన్న‌వించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో అనేక గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొంటున్న స్పందించ‌ని హీరోలు త‌మ స‌మ‌స్య‌కు మాత్రం ఏకంగా విశాఖ వెళ్లి మ‌ర అనుమ‌తులు కోర‌డాన్ని ఏవిధంగా స‌మ‌ర్థించుకుంటారంటూ నిల‌దీశారు.


‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ... ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ’’ అని సాహితీవేత్తలు చెబుతుంటారు. సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖుల వ్యవహార శైలి కృష్ణశాస్త్రిని గుర్తుకుతెస్తున్నది. తెలుగు ప్రజలు కరోనా వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతుంటే చిరంజీవి నేతృత్వంలోని కొంతమంది సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి తమకు విశాఖలో స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించడంతోపాటు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని కోరడం ఎబ్బెట్టుగా లేదా? అంటే నిల‌దీశారు. వాస్త‌వానికి ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా... ప్లాస్టిక్‌ సర్జరీలతో తెర మీద అలరిస్తున్న హీరోలకు మున్ముందు ఆదరణ ఉండకపోవచ్చు అంటూ కామెంట్ చేశారు. 

 

రాధాకృష్ణ త‌న వ్యాసంలో  ఈ ప‌దాలు రాయ‌డంతో చిరంజీవిని టార్గెట్ చేసిన‌ట్లుగా అర్థ‌మ‌వుతోంది. గ‌తంలో అల్లు అర్జున్‌, రాంచ‌ర‌ణ్‌ల‌కు ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకున్న విష‌యం తెలిసిందే. అంతేకాక 60ఏళ్లు దాటిన హీరోలు అంటూ రాశారు. చిరంజీవికి 60ఏళ్లు దాటాయి. మెగా ఫ్యామిలీనే పూర్తిగా టార్గెట్ చే్స్తూ వ్యాసాన్ని కొన‌సాగించార‌ని స్ప‌ష్టం అవుతోంది. వాస్త‌వానికి గ‌తంలోనూ మెగా ఫ్యామిలీ హీరోల‌పై రాధాకృష్ణ త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డ సంద‌ర్భాలున్నాయి. ఈవిష‌యం మెగా ఫ్యామిలీ అర్థం కాలేదు అని మ‌నం అనుకోలేం గాని ఏవిధంగా స్పందిస్తారో....చూడాల్సి ఉంది. అస‌లే ఈ మ‌ధ్య‌లో నాగ‌బాబు సోష‌ల్ మీడియాను వేదికగా చేసుకుని త‌న మాట‌ల తూట‌ల‌తో..సెటైర్ల‌తో వార్త‌ల్లో వ్య‌క్తిగా మారిపోయారు. చూడాలి మ‌రి దీనిపై ఏమైనా స్పందిస్తారో లేదోన‌ని. 

మరింత సమాచారం తెలుసుకోండి: