అధికారంలోకి వచ్చి సరిగ్గా  ఏడాది దాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన రాజకీయ ఆటలో  తెలుగుదేశంపార్టీ నేతలు విలవిల్లాడిపోతున్నారు. జగన్ దెబ్బను తట్టుకోలేక చాలామంది గిలగిల్లాడిపోతున్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు చేయటంతోనే టిడిపిలో కలకలం మొదలైంది. అవినీతి ఆరోపణలతో కేసులు నమోదవ్వటం, అరెస్టులు మొదలవ్వటం కింజరాపు అచ్చెన్నాయుడుతో మొదలవుతుందని టిడిపిలో ఊహిచుండరు.  అచ్చెన్నంటే బిసి నేతగా చెప్పుకుంటున్నాడు కాబట్ట మాజీమంత్రి జోలికి వెళ్ళరని అనుకున్నట్లున్నారు. కానీ జగన్ కొట్టిన దెబ్బకు టిడిపి వణికిపోతోంది. హైదరాబాద్ నుండి అచ్చెన్న కోసం చంద్రబాబు పరిగెత్తుకుని అమరావతికి రావటమే ఇందుకు నిదర్శనం.

 

మొదటి ఏడాదంతా సంక్షేమ పథకాల అమలు విషయంలోనే  జగన్ బిజీగా గడిపేశాడు. ఏ ఏ వర్గాలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, పథకాలు అమలవుతోందా ? లేదా ? అన్న విషయాలపైనే దృష్టి పెట్టేశాడు. ఎన్నికలకు ముందు తానిచ్చిన నవరత్నాల పథకాలను దాదాపు గ్రౌండ్ చేసేశాడు.  ప్రభుత్వ లెక్కల ప్రకారం జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల ద్వారా రాష్ట్రంలోని సుమారు 3.9 కోట్ల మంది ఏదో ఓ పథకంలో లబ్ది పొందినట్లు అంచనా. అంటే మొత్తం 5 కోట్ల జనాభాలో దాదాపు 80 శాతం జనాలు లబ్దిదారులైపోయినట్లే అనుకోవాలి.

 

తన పథకాల ద్వారా జనాలను  పూర్తి సంతృప్త స్ధాయికి తీసుకెళ్ళిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ ఆట మొదలుపెట్టాడు. ఈ ఏడాదిలో  టిడిపి నేతలు కూడా ఎన్నోసార్లు రెచ్చ గొట్టారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు  టిడిపి హయాంలో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపించిన జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది అయినా విచారణలు కానీ చర్యలు కానీ ఎందుకు తీసుకోలేకపోతేన్నాడంటూ చంద్రబాబు, చినబాబు అండ్ కో చాలాసార్లు ఎద్దేవా చేశారు. వాటన్నింటికి ఇదే సమాధానం అన్నట్లుగా జగన్ ఒక్కసారి జూలు విదిలించాడు. దాంతో చంద్రబాబు, చినబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియాకు ఏమి చేయాలో ఇపుడు దిక్కు తోచటం లేదు.

 

అవినీతి ఆరోపణలపై అచ్చెన్నను అరెస్టు చేయగానే ఏమి మాట్లాడాలో తెలీని చంద్రబాబు అండ్ కో బిసిలపై వేధింపులంటూ యాగీ మొదలుపెట్టారు. బిసి నేతను అరెస్టు చేశారని, అచ్చెన్నను  అరెస్టు చేయటమంటే బిసిలపై దాడులుగా కలరింగ్ ఇచ్చేందుకు చంద్రబాబు, లోకేష్ అండ్ కో చాలా ప్రయత్నించారు. అయితే వాళ్ళ మాటలను ఎవరూ లెక్క చేయలేరు. చివరకు బిసి సామాజికవర్గాలు కూడా అచ్చెన్న అరెస్టు వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ఇష్టపడలేదు. పైగా అచ్చెన్నను బిసి నేతగా చంద్రబాబు అండ్ కో ప్రచారం చేయటన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. దాంతో చంద్రబాబు నోరు మూతపడిపోయింది.

 

పార్టీలోని రెండు బిగ్ వికెట్లు పడిపోగానే మిగిలిన నేతలు మాజీ మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. వీళ్ళద్దరి అరెస్టు తర్వాత అరెస్టవ్వబోయే  మూడో వికెట్ ఎవరిదో అర్ధంకాక అందరిలోను ఆందోళన పెరిగిపోతోంది. ఎటువైపు జగన్ దెబ్బ కొడతాడో తెలీక, ఆ దెబ్బను ఏ విధంగా కాచుకోవాలో తెలీక అల్లాడిపోతున్నారన్నది నిజం. మొత్తానికి ఇంతకాలం జగన్ ను రెచ్చగొట్టినందుకు ఫలితం ఇపుడు టిడిపి నేతలకు అందుతోందనే చెప్పాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: