వైసీపీలో ఏం జరుగుతుంది..? ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు..? ఆయన్ని వైసీపీ పెద్దలు టార్గెట్ చేస్తున్నారా..? లేక ఆయనే వైసీపీ పెద్దలని టార్గెట్ చేస్తున్నారా..? సీఎం జగన్, రఘురామకృష్ణంరాజు విషయాన్ని ఎలా డీల్ చేయబోతున్నారు.? ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానం తెలియాలంటే.. ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.

 

అధికారంలోకి వచ్చిన నాటినుంచే వైసీపీ నరసాపురం ఎంపీ రాఘురామకృష్ణమరాజుకు సొంత పార్టీ నేతలతో విభేదాలు మొదలయ్యాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. కేంద్ర పెద్దలతో ఆయనకుండే చనువు, పార్లమెంటు సాక్షిగా ఇంగ్షీషు మీడియం చదువులపై వైసీపీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం., రాష్ట్రంలో ఇసుక రేట్లపై విమర్శలు చేయడం, అలాగే తిరుపతి వెంకన్న భూముల వ్యవహారంలో వైసీపీని వ్యతిరేకించడం, ఇలా చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఏ సామాజిక వర్గానికైతే ఎక్కువ పదవులు దక్కుతున్నాయో.. ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు, కోటరీగా ఏర్పడి ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. దీంతో సీఎం జగన్ ను కలిసే అవకాశం కొందరికి తప్ప మరెవరికీ లభించడం లేదని రాఘురామకృష్ణమరాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

 

అసలే రాఘురామకృష్ణమరాజు మీద అసంతృప్తిగా ఉన్న వైసీపీ పెద్దలు.. ఆయనకు చెక్ పెట్టేందుకు నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు రంగంలోకి దించారు. దీనికి మూల కారణం సామాజికవర్గం. కరోనా సమయంలోనూ జగన్ అందరితో కలుస్తున్నారన్నారని. జగన్‌కు పక్క చూపులు చూడాల్సిన అవసరం లేదని. ఆయన ఏ చూపు చూస్తే రఘురామకృష్ణంరాజు ఎంపీ అయ్యారు.. ఆయన ఏ చూపు చూస్తే పార్లమెంట్ పదవి దక్కిందని ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రసాదరాజు. జగన్ చుట్టూ ఎటువంటి కోటరీ లేదని.. జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదని ఎంపీ చెప్పడం బాధాకరం అన్నారు.జగన్‌ను మనస్ఫూర్తిగా కలవాలని ఉంటే, ఆయనను కలిసే అవకాశం ఉందన్నారు. అయితే ఎమ్మెల్యే ఈ చేసిన ఈ వ్యాఖ్యలపై రఘురామకృష్ణంరాజు మళ్లీ కౌంటర్ ఇచ్చారు.

 

తమ పార్టీలో ఓ విచిత్రమైన సిద్ధాంతం ఉందని, ఇతర పార్టీల్లోని వారిని ఎవరినైనా తిట్టాలంటే వైసీపీలో ఉన్న వారి సామాజిక వర్గం నేతలతోనే తిట్టిస్తారు. ఉదాహరణకు పవన్ కల్యాణ్ ను ఏమైనా అనాలంటే తన పార్టీలో ఉన్న వారి సామాజిక వర్గ ఎమ్మెల్యేలతోనో, మరొకరితోనే మాట్లాడిస్తారు. ఇప్పుడు తనపైనా అదే తీరులో నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుతో మాట్లాడిస్తున్నారని అన్నారు. జగన్ దయతో 20 రోజుల్లో ఎంపీనయ్యానని, జగన్ వల్లే పార్లమెంటు కమిటీ చైర్మన్ అయ్యానని ప్రసాదరాజు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ తానంతట తానుగా ఎప్పుడూ వైసీపీలోకి రావాలని అనుకోలేదని . ఎంతో బతిమాలితేనే వచ్చానని తెలియజేశారు.

 

తనకు సీటు ఇవ్వమని ఎవర్నీ ప్రాధేయపడలేదని, మీరు రావాలి, మీరు వస్తేనే మాకు సీట్లు పెరుగుతాయి అని వైసీపీ పెద్దలు బతిమాలారని. నరసాపురం టీడీపీ కంచుకోట అని, తనని ఇక్కడ్నించి పోటీ చేయాలి అని అడిగితేనే వైసీపీలోకి వెళ్లానని ఆయన తెలియజేశారు. తాను కాబట్టే ఇక్కడ్నించి నెగ్గాను అని ఆయన చెప్పారు. జగన్ బొమ్మ పెట్టుకుని నెగ్గామని ఎమ్మెల్యేలు చెప్పుకోవచ్చు గాక, కానీ తన ప్రభావం వల్ల కూడా నరసాపురం ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యేలకు ఓట్లు పడ్డాయన్నది నిజం అని ఆయన తేల్చి చెప్పారు.

 

ఇకపోతే అందరిలా మీదపడి డబ్బులు కలెక్ట్ చేయడం తన పద్ధతి కాదని.. అలాంటి సొమ్ముతో ఫోటోలు దిగడానికి వెళ్లలేదన్నారు. అలాగే తన స్నేహితుడు ప్రసాదరాజుకి మంత్రి పదవి దక్కాలనీ కోరుకుంటున్నానని తెలిపారు. మాది చాలా చిన్న సామాజిక వర్గం.. ఇందులో చీలికల కోసం ప్రయత్నించొద్దు.. మా మధ్య చిచ్చుపెట్టొద్దు అంటూ సీఎం జగన్‌ చుట్టూ వున్న కోటరీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఎక్కడా రఘురామకృష్ణంరాజు, సీఎం వైఎస్‌ జగన్‌ మీద విమర్శలు చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. నిజానికి, ఆయన ఈ రోజు వరకూ సీఎంని విమర్శించింది లేదు. పైగా తాను నేన పార్టీలోనే వున్నానని, పార్టీలోనే వుంటానని. జగన్‌ తనకు అత్యంత సన్నిహితుడని, ఆయనతో సంబంధాలు ఇలాగే ఉండాలనుకుంటున్నానని ఆయన పలు సందర్భాలలో చెప్పారు.

 

ఈ నేపధ్యంలో, ఆయన తీరుతో విసిగిపోయిన వైసీపీ పెద్దలు ఎలాగైనా ఆయన్ని పార్టీ నుచి తొలగించాలని సీఎం జగన్ కు సూచించారట. దీంతో జగన్ కూడా సరే అన్నట్టు సమాచారం. అయితే జూన్ 19 న రాజ్యసభ ఎన్నికలు ఉన్న కారణంగా, ఇప్పుడు ఆయన్ని ఎవరు పట్టించుకోకండి, ఆ తర్వాత పార్టీ నుంచి తప్పిద్దాం అని సీఎం జగన్ వారికి చెప్పినట్టు రాజకీయ వర్గాల్లో టాక్. దీనికి అనుగుణంగా రఘురామకృష్ణంరాజు విషయంలో ఎవరూ మాట్లాడొద్దని నరసాపురం పార్లమెంటు పరిదిలోనే ఎమ్మెల్యేలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారట.. వాస్తవానికి రఘురామకృష్ణంరాజు కూడా ఇదే కోరుకుంటున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఆయన్ని వైసీపీ నుంచి తొలగిస్తే ఆ వెంటనే బీజేపీలో చేరుతారని, ఆ పిమ్మట వైసీపీ నేతలతో పాటు సీఎం జగన్ ని కూడా డైరెక్ట్ గానే టార్గెట్ చేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పెద్దలు ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారట, కానీ ఆ పార్టీకి వైసీపీకి రాష్ట్రంలో సరైన సంబంధాలు లేకపోవడంతో ఆ పదవి ఆగిపోయిందట. దీంతోనే రఘురామకృష్ణంరాజు ఎప్పటినుంచో వైసీపీని వీడి, బీజేపీలోకి చేరేందుకు చూస్తున్నారట. సరైన సమయం కోసం చూస్తున్న రఘురామకృష్ణంరాజు ఇప్పుడు సరైన సమయం వచ్చిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: