పార్టీ చూసినా ఏమున్నది గర్వ కారణం అన్నట్టుగా తయారయ్యాయి ఏపీ రాజకీయాలు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు నిత్యం కుట్రలు ,కుతంత్రాలు, వెన్నుపోట్లు , ఇలా ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజా సంక్షేమం తప్ప మిగతా అన్ని విషయాలు తమకు కావాలి అన్నట్టుగా ఏపిలో ప్రతిపక్షాలు అధికార పార్టీపై పైచేయి చేసేందుకు ప్రయత్నిస్తుండగా... ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొంటూనే వాటిపైన పైచేయి సాధించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉండడం , అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేసి, పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలను వైసీపీలో చేర్చుకుని తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలని వైసిపి భావిస్తోంది.

 

IHG


 ఇక వైసిపి అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, వివాదాస్పదంగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల్లోకి తీసుకు వెళ్లిన ప్రతిపక్షాలు ప్రభుత్వ ప్రతిష్టనుమసకబార్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలను ఆ పార్టీకి రాజీనామా చేయించి, తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 19 తర్వాత ఆ కార్యక్రమానికి నాంది పలకాలని చూస్తోంది. ఇదిలా ఉంటే వైసిపి, టిడిపి రెండు పార్టీలను రాజకీయంగా దెబ్బ తీసి 2024 ఎన్నికల నాటికి బలపడాలని బిజెపి ప్రయత్నిస్తోంది. 

 


దీనిలో భాగంగానే రెండు పార్టీల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో బిజెపి బలపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ మూడు పార్టీల వ్యవహారం ఇలా ఉంటే జనసేన మాత్రం సైలెంట్ గానే ఉంది. బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల నాటి కి బీజేపీ సహకారంతో ముఖ్యమంత్రి అవ్వాలని పవన్ భావిస్తున్నారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లి బలోపేతం చేసే విషయంపై ఆయన తెలుగుదేశం, బిజెపి, వైసిపి ఈ మూడు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కనుక ఉనికి కోల్పోతే బీజేపీ సహకారంతో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని, తమకు బిజెపి సహకారంతో పాటు పాటు ఆర్థిక అండదండలు లభిస్తాయని పవన్ భావిస్తున్నారు. 


ఇలా ఎవరికి వారు రాజకీయ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం ఏపీ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ప్రజల్లో మాత్రం రాజకీయాలపై విసుగు కనిపిస్తోంది. ప్రస్తుతం సమయంలో ఈ విధంగా రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే ప్రయత్నాల్లో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు కుదేలయ్యారని,  ప్రజల సంగతి కాస్త పట్టించుకోండి అంటూ వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ లో కాస్త అసంతృప్తి ఉన్నా, జనాల్లో ఆ పార్టీపై సానుకూల దృక్పథం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. 


టిడిపి పూర్తిగా తింటున్నట్టుగానే కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు వయసు రీత్యా యాక్టివ్గా ఉండే పరిస్థితి లేకపోవడం, ఆయన తర్వాత ఆ పార్టీని నడిపించే వారు ఎవరనేది క్లారిటీ లేకపోవడం వంటి పరిణామాలతో తెలుగుదేశం పార్టీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని చాలా మంది ఇప్పుడే అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ టిడిపి అధినేత చంద్రబాబును మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. తాను చూస్తూ చూస్తూ ఉండగానే పార్టీ పరిస్థితి ఈ స్థాయికి దిగజారి పోవడం ఆయనకు మింగుడు పడని అంశంగా మారింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ పార్టీల ఎత్తులు, పై ఎత్తులు అన్నట్టుగా వ్యవహారాలు సాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: