చంద్రబాబును అంతా అపర చాణక్యుడితో పోలుస్తారు.. రాజకీయ వ్యూహాలు పన్నడంతో దిట్ట అంటారు. కానీ వయస్సు ప్రభావమో.. ఏమో కానీ..ఆయన వ్యూహాలు మరీ నేలబారుగా ఉంటున్నాయి. ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకుంటున్నాడేమో అని సందేహం కలిగేలా ఆయన ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్నారు.

 

 

పార్టీ అధినేతగా నాయకులు కాపాడుకోవాలి..అందులో తప్పులేదు.. కానీ నాయకులు కదా అని ప్రతి అడ్డమైన నాయకుడికీ అండగా నిలిస్తే జనం చీదరించుకుంటారన్న స్పృహ చంద్రబాబుకు లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ అయ్యన్నపాత్రుడు.. అయ్యన్న పాత్రుడిపై ప్రభుత్వం నిర్భయ కేసు పెట్టినట్టు తెలుస్తోంది. ఇంతకీ అయ్యన్న పాత్రుడిపై కేసు ఎందుకు పెట్టారో తెలిస్తే.. జనం ఛీకొట్టకమానరు.

 

 

రాజకీయ పార్టీ నాయకుడిని కదా అని ఆయన.. ఓ మహిళా కమిషనర్ ను నోటికొచ్చినట్టు బూతులు తిట్టారట. బట్టలూడదీయిస్తా అని అన్నారట. సదరు మహిళా కమిషనర్ పోలీసు కేసు పెట్టారు. దానిపై పోలీసులు చర్య తీసుకున్నారు. చంద్రబాబు ఇలాంటి వాటిని కూడా సమర్థిస్తూ.. మా బీసీ నాయకుడిపై కేసులు పెడతారా అంటూ గర్జించడం ఏరకం రాజకీయమో మరి.

 

 

ఇలాంటి నోటి దురుసు నేతలను.. జేసీ ప్రభాకర్ రెడ్డి వంటి అక్రమార్కులపై కేసులు పెడితే, అరెస్టులు చేస్తే.. అన్యాయం.. అక్రమం.. విపక్షం గొంతు నొక్కేస్తున్నారు.. బీసీ నేతలను అరెస్టు చేస్తారా.. విపక్షంపై కక్ష సాధిస్తారా.. ఏం తమాషాలు చేస్తున్నారా అంటూ చంద్రబాబు రెచ్చిపోయి ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ఆంధ్రప్రజలకు ఏం సందేశమిస్తున్నారో అర్థంకాకుండా ఉందంటున్నారు జనం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: