రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు బలహీనత బయటపడింది.  పార్టీ ఎంఎల్ఏలపై చంద్రబాబుకు పట్టు జారిపోయిందన్న విషయం స్పష్టమైపోయింది. అసలు గెలుపు అవకాశమే లేదని తెలిసి కూడా పోటి చేయాలని నిర్ణయించటమే  పెద్ద తప్పు.   టిడిపి  పోటికి రెడీ అవ్వగానే అభ్యర్ధి వర్ల రామయ్య ఓటమి ఖాయమైపోయింది. పోటికి దిగి పరువు పోగొట్టుకోవటం తప్ప ఒరిగేదేమీ లేదని తెలిసినా, చెప్పినా చంద్రబాబు వినలేదని సమాచారం. చివరకు అందరూ అనుకున్నట్లుగానే పోయింది చంద్రబాబు పరువే. ఎందుకంటే పార్టీకి ఉన్న 23 ఓట్లలో పోలయ్యింది 17 మాత్రమే. తమ పార్టీ ఓట్లనే నూరుశాతం వేయించుకోలేకపోయిన చంద్రబాబు ప్రత్యర్ధి పార్టీ ఓట్లపై కన్నేయటమే విచిత్రంగా ఉంది.

 

పోలింగ్ లో చివరకు సొంత ఎంఎల్ఏలే చంద్రబాబునాయుడుకు పెద్ద షాకిచ్చారు. ఓటమి ఖాయమని ముందే తెలిసినా  పోలింగ్ లో  చంద్రబాబుకు  ఊహించని విధంగా  మరో రూపంలో  షాక్ తగిలింది.  మొత్తం 175 ఓట్లలో 173 పోలయ్యాయి. ఇందులో వైసిపి ఓట్లు వైసిపి అభ్యర్ధులకు పడింది. దాంతో వైసిపి తరపున పోటి చేసిన ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పరిమళ్ నత్వానికి తలా 38 ఓట్లు పడ్డాయి. జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ఓటు కూడా వైసిపికే పడటంతో అధికార పార్టీ బలం 151కి అదనంగా రాపాక ఓటు జత కలిసినట్లయ్యింది.  ఇక టిడిపి విషయానికి వచ్చేసరికి నాలుగు ఓట్లు ఇన్ వాలీడ్ అవ్వటమే పెద్ద ట్విస్టు.

 

టిడిపికి ఉన్నదే 23 మంది ఎంఎల్ఏలు. వీళ్ళల్లో ఇప్పటికే ముగ్గురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, కరణం బలరామ్ పార్టీకి దూరమయ్యారు. కాబట్టి వీళ్ళు వర్లకు ఓట్లేస్తారనే నమ్మకం ఎవరిలోను లేదు. ఇక అచ్చెన్న రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి ఓటింగ్ కు వచ్చే అవకాశం లేదని  అర్ధమైపోయింది.  పోస్టల్ బ్యాలెట్ కోసం టిడిపి చేసిన అన్నీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. పోలింగ్ రోజున రేపల్లె ఎంఎల్ఏ అనగాని సత్యప్రసాద్  కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న కారణంగా ఓటింగ్ కు రాలేనంటూ కబురు చేశాడు.

 

అంటే తిరుగుబాటు చేసిన ముగ్గురు ఎంఎల్ఏలు+ఇద్దరు ఎంఎల్ఏలు పోగా మిగిలిన వాళ్ళు 18 మంది ఎంఎల్ఏలు. వీళ్ళలో ఎంతమంది వర్లకు ఓట్లేస్తారు అనే విషయంలో మొదటినుండి పార్టీలోనే అనుమానాలు వ్యక్తమవుతోంది.  అందరు అనుకున్నట్లే ఓట్ల లెక్కింపులో పెద్ద షాక్ కొట్టింది. ఎందుకంటే పార్టీకి పడాల్సిన 18 ఓట్లలో మళ్ళీ ఒకటి మైనసయ్యింది. అంటే వర్లకు పడిన ఓట్లు 17 మాత్రమే.  ముగ్గురు తిరుగుబాటు ఎంఎల్ఏలతో పాటు మరో ఎంఎల్ఏ కూడా ఓటు కూడా ఇన్ వాలీడ్ అయిపోయింది. ఓటింగ్ లో ఇన్ వాలీడ్ అయిన ఓటు ఏ ఎంఎల్ఏదనే విషయంలో పార్టీలో అయోమయం మొదలైంది. అయితే చివరకు రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవాని ఓటని తేలింది.

 

 

ఇదే సమయంలో మరో ఎంఎల్ఏ బ్యాలెట్ పేపర్ పై ’గెలిచేటపుడు చంద్రబాబు సొంత సామాజికవర్గానికి, ఓడిపోయేటపుడు మాత్రం ఎస్సీలకా’ ? అంటూ రాయటం సంచలనంగా మారింది. బ్యాలెట్ పేపర్లో ఇలా రాయటమంటే అది టిడిపి ఎంఎల్ఏ పనే అన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఎందుకంటే పార్టీ తరపున ఈజీగా రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలున్నపుడు తమ సామాజికవర్గానికో లేకపోతే తన వర్గానికో చంద్రబాబు కట్టబెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.

 

తాజాగా గెలుపు అవకాశం లేదని తెలిసినా కావాలనే చంద్రబాబు పోటికి రెడీ అయ్యాడు. అదికూడా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వర్ల రామయ్యను పోటిలోకి దింపటంతో ఎస్సీలు మండిపోతున్నట్లున్నారు. ఇందుకు బ్యాలెట్ పేపర్ మీద రాసిన రాతలే నిదర్శనం.  రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ద్వారా బయటపడిందేమంటే పార్టీలోని ఎంఎల్ఏల్లో చాలామంది చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని. వర్లకు రావాల్సిన 23 ఓట్లలో  17 ఓట్లు పడటంతోనే ఎంఎల్ఏల్లోని అసంతృప్తి బయటపడింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: