ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 173 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏసీబీ కేసులో అరెస్టైన అచ్చెన్నాయుడు, మరోవైపు హోమ్ క్వారంటైన్‌లో ఉన్న అనగాని సత్యప్రసాద్‌లు తమ ఓటు హ‌క్కును వినియోగించుకోలేక పోయారు. పోలైన ఓట్లను మొత్తంగా చూసుకుంటే వైసీపీకి మొత్తం 151 ఓట్లు ప‌డ‌గా, టీడీపీకి మాత్రం 17 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్ధులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ ఘన విజయం.. టీడీపీ అభ్య‌ర్ధి వ‌ర్ల రామ‌య్య పరాజయం ఒకే సారి జరిగిపోయింది.

 

ఈ క్రమంలో అధినేత చంద్రబాబుకు ఒక భారీ దెబ్బ తగలబోతునట్టు తెలుస్తుంది. తన స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు తనని బలిపశువును చేశారని వర్ల రామయ్య భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై అసంతృప్తిగా ఉన్న వర్ల రామయ్య పార్టీకి రాజీనామా చేయాలని చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజ్యసభ ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన ఎమ్మెల్యేల బలం లేదని తెలిసి కూడా చంద్రబాబు తనను నిలబెట్టి తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని వర్ల బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఒకరిద్దరు తన సన్నిహితుల దగ్గర ఈ మేరకు వర్ల రామయ్య కన్నీరు కూడా పెట్టుకున్నారట.

 

గెలిచే సమయంలో తన సామాజిక వర్గం వారిని, ధనవంతులను, వ్యాపారవేత్తలను నిలబెట్టిన చంద్రబబు… కచ్చితంగా గెలెవము అనుకున్న సమయంలో తన ఆత్మాభిమానంతో ఆడుకున్నారని వర్ల తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. అలాగే నిన్న వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా చంద్రబాబుపై మండిపడ్డారు. తన స్వార్థ రాజకీయాల కోసం వర్ల రామయ్యను చంద్రబాబు బలిపశువును చేశారని.. చంద్రబాబు ఇకనైనా ఈ కుల రాజకీయాలు మానుకోవాలని ఆమె సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు క్యాష్ ముఖ్యమని భావించిన చంద్రబాబు… ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని రోజా అన్నారు. అయితే ఇప్పుడు వర్ల రామయ్య నిర్ణయంతో రోజా మాటలకి ప్రాదాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా వర్ల రామయ్య మాత్రం తీవ్ర మనస్తాపానికి గురయ్యారని.. ఈ మేరకు ఆయన రాజీనామా చేయడం పక్కా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: