మంచి చేసినా.. చెడు చేసినా.. అధికారపక్షాన్ని మాత్రం ఎప్పుడూ తిడుతూనే ఉండాలి ఇదే అసలైన రాజకీయం. అసలు అలా చేయకపోయే వాళ్ళని రాజకీయ నాయకులు అని ఎందుకు అంటారులే..మన పిచ్చి కాకపోతే. దేశంలోని అన్నీ రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటివి కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. తాజాగా ప్రభుత్వం పదో తరగతి పరీక్షలపై తీసుకున్న నిర్ణయంతో ఇది మరో సారి బయటపడింది.

 

మొన్నటివరకు కరోనా నేపధ్యంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని భావించింది. ఇందుకు జూలై 10 నుంచి 17వరకూ తేదీలను కూడా ప్రకటించింది. 11 పేపర్లను 6కు కుదించారు కూడా. పరీక్ష కేంద్రాలు రెట్టింపు చేసి.. అన్ని చర్యలు తీసుకున్నారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ నిర్ణయంపై విరుచుకుపడ్డారు. పిల్లల ప్రాణాలతో చెలాగాటలు వద్దు అంటూ ప్రభుత్వ నిర్ణయంపై మంది పడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా చాలా మంది నేతలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పిల్లలకి ఏమన్నా జరగరానిది జరిగితే కష్టం అని భావించిన కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. దీంతో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోయి సీఎం జగన్ పై నిప్పుల వర్షం కురిపించారు. సరే పిల్లలపై ప్రేమతో ఇదంతా చేశారులే అనుకుందాం.

 

అయితే ఇప్పుడు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. టెన్త్ పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీని రద్దు చేసి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మొత్తం ఆహ్వానించింది.. కానీ, కొందరు నాయకులు మాత్రం దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. టీవీ డిబేట్లలో కూర్చొని.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..

 

కానీ, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ముందే తీసుకోవాల్సింది అని కొందరు, అసలు ఈ విషయంపై ముందే నిర్ణయం తీసుకొని వేరే రాష్ట్రాలకు రోల్డ్ మోడల్ అవ్వాల్సిందని మరి కొందరు. వారి అర్ధం లేని మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తున్నాయి. అయినా ఇక్కడ ఏ విద్యార్థికి నష్టం జరగలేదు, ప్రభుత్వం ముందే మేల్కొని సరైన నిర్ణయం తీసుకుంది. దీన్ని రాజకీయంగా వాడుకోవడం నిజంగా సిగ్గుచేటు. అయినా పరీక్షలు పెడతాం అంటే తిట్టిన నోర్లు.. పరీక్షలు రద్దు చేస్తే ఎందుకు మెచ్చుకోలేక పోతున్నాయి. ఓ మర్చిపోయాను.. మీరు స్వార్ధపు రాజకీయ నాయకులు కదా.!

మరింత సమాచారం తెలుసుకోండి: