మల్లన్న, రాములమ్మ, మంగ్లీ, బిత్తిరి సత్తి, సావిత్రి.. ఇలా కొత్త క్యారెక్టర్లకు ప్రాణం పోసే వీ6లో అడుగు పెట్టిన కొత్త క్యారెక్టర్ సదన్న. అయితే ఇక్కడ ఓ తేడా ఉంది. పైన చెప్పిన క్యారెక్టర్లన్నీ కేవలం వీ6 క్రియటివ్ జర్నలిస్టుల బుర్రల్లో ప్రాణం పోసుకున్నవే... కానీ ఈ సదన్న మాత్రం అప్పటికే ఓ చిన్నపాటి స్టార్ గా ఎదిగిన క్యారెక్టర్. తనకు తాను సొంతంగా క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్. 


యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న కామెడీ క్యారెక్టర్ సదన్నను అలాగే దించేసింది వీ6. ఆ క్యారెక్టర్ కు తనదైన మార్పులు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయడంలో వీ6 విజయవంతం అయ్యింది. ఈ పాత్రకు వస్తున్న స్పందన ఆ చానల్ కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. గతంలో సావిత్రి, బిత్తిరి సత్తి క్యారెక్టర్లను క్రియేట్ చేసినప్పుడు ఆ రెండు పాత్రల మధ్య అన్నా చెల్లెళ్ల బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసారు. కానీ ఇప్పుడు ఈ రాధ, సదన్న క్యారెక్టర్ల మధ్య మాత్రం బావా మరదలు టైపు కెమిస్ట్రీ నడిపిస్తున్నారు. అది కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. 


కామెడీ పండించడంలో సదన్న ఇప్పటికే బాగా ఆరితేరిపోయాడు. ఇక ఇప్పుడు దానికి మరింత పదును పెడుతున్నాడు. గతంలో వీ 6 చేసిన క్యారెక్టర్లనీ హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకునేవి. కానీ ఈ సదన్న మాత్రం అచ్చె తెలంగాణ పల్లెల్లో షూటింగ్ చేసుకుంటూ.. అక్కడి వాతావరణాన్ని తాజాగా ప్రేక్షకులను అందించడం మరింత అదనపు ఆకర్షణగా మారింది.  


మొత్తానికి న్యూస్ ఛానళ్లు అంటే ఎంత సేపూ.. విసుగుపుట్టించే వార్తలే అనిపించకుండా ఇలా సెటైర్ ప్రోగ్రాములు నడిపించడంలో వీ 6 ఛానల్ ఇప్పటికే ఆరితేరిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు దాదాపు ప్రతి తెలుగు న్యూస్ ఛానల్ కూడా తీన్మార్ వార్తల తరహాలో ఓ అరగంట ప్రోగ్రామ్ డిజైన్ చేశాయంటే అది తీన్మార్ వార్తల ప్రభావమే.

మరింత సమాచారం తెలుసుకోండి: