కరోనా కట్టడి విషయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాల కంటే మెరుగైన పనితీరు కనబరుస్తోంది. ఈవిషయాన్ని కరోనా గణాంకాలు.. నిర్వహిస్తున్న టెస్టులు చెప్పకనే చెబుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో జగన్ సర్కారు పని తీరు సైలంట్ గా సాగిపోతోంది. అదే సమయంలో కరోనా కట్టడికి ఏం చేయాలో అవన్నీ చేస్తూ.. మహమ్మారిని అదుపు చేస్తున్నారు.

 

 

ఒక్కసారి కరోనా విజృంభణ ప్రారంభ దశను గుర్తు చేసుకుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు ఓ రేంజ్‌లో ఉండేది.. ఆయన రెండు మూడు రోజులకు ఓసారి ప్రెస్ మీట్ నిర్వహించి.. కరోనాను అలా కట్టడి చేస్తున్నాం.. ఇలా కట్టడి చేస్తున్నాం అంటూ.. గంటల తరబడి వివరించేవారు.. గంటల కొద్దీ సాగినా ఆ ప్రెస్ మీట్లు జనం చెవి కోసుకుంటూ వినేవారు కూడా..

 

 

ఆహా.. కేసీఆర్ ఏం చేస్తున్నాడురా.. మన జగనూ ఉన్నాడు..ఎందుకూ అంటూ అప్పట్లో కొందరు ఏపీ వాసులు కూడా కామెంట్లు చేశారు. చాలా మంది ఆంధ్రవాసులు కూడా కేసీఆర్ ప్రెస్ మీట్లు ఆసాంతం చూస్తూ.. అబ్బా మన సీఎం కూడా ఇలా చేస్తే బావుండు అనుకున్నారు కూడా. కానీ.. జగన్ రూటే సెపరేటు. పని ఎక్కువ ప్రచారం తక్కువ. చేసే పని చేసుకుంటూ పోవడం ఆయన ఫిలాసఫీ.

 

 

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సీన్ చూస్తే ఉల్టాపల్టా అవుతోంది. కేసుల సంఖ్య ఆంధ్రాలో ఎక్కువగా ఉన్నా మరణాలు, వ్యాప్తి సంఖ్య తెలంగాణతో పోలిస్తే చాలా తక్కువ. అంతే కాదు.. మొదటి నుంచి ఏపీలో టెస్టుల సంఖ్య చాలా ఎక్కువ. చాలా రోజుల నుంచే రోజూ 6 వేల వరకూ టెస్టులు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ వాసులు ఆంధ్రాకు వెళ్లాలంటే అనేక కండీషన్లు.

 

 

మరోవిషయం ఏంటంటే.. తెలంగాణలో కేసులన్నీ హైదరాబాద్ లోనే పోగుపడ్డాయి. కానీ ఆంధ్రా విషయానికి వస్తే.. ఎన్నో నగరాలు.. విశాఖ, కర్నూలు, విజయవాడ, గుంటూరు.. కానీ అన్నిచోట్లా బాగానే కంట్రోలు చేస్తూ వస్తున్నారు. సీఎం జగన్ కూడా హడావిడి చేయకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించి.. వారి పని వారిని సక్రమంగా చేసుకోనిస్తూ అవసరమైన చోట జోక్యం చేసుకుంటూ సైలంట్ గా పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు రెండు రాష్ట్రాలను పోల్చి చూస్తున్నవారు.. హడావిడి చేయకుండా సైలంట్‌గా పని చేసుకుపోయే వాడే జగనంటే అంటూ కామెంట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: